థియేటర్లలో పనిచేసే కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ‘కింగ్’ నాగ్ అభిమానులు

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 04:55 PM IST
థియేటర్లలో పనిచేసే కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ‘కింగ్’ నాగ్ అభిమానులు

Updated On : August 29, 2020 / 5:30 PM IST

Akkineni fans Social Work: వ‌య‌సు పెరిగే కొద్ది ఆయ‌న ఇంకా యంగ్‌గా త‌యార‌వుతున్నారు. ఆయ‌నే టాలీవుడ్ మ‌న్మ‌థుడు.. కింగ్ నాగార్జున‌. ఆగ‌స్ట్ 29న ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో నాగార్జున అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న నటీనటులు, సాంకేతిక నిపుణులను ఆదుకోవడానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ముందుకొచ్చి వారికి సాయం చేస్తున్నారు.

Akkineni fans

అయితే థియేటర్లలో పనిచేసే కార్మికులను పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో నాగార్జున ఫ్యాన్స్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో పనిచేసే కార్మికులకు తమ సొంత డబ్బుతో నిత్యావసరాలు పంపిణీచేసి మంచి మనసు చాటుకున్నారు.

బియ్యం (సోనా మసూరి)
కందిపప్పు
ఆశీర్వాద్ ఆటా
సన్ ఫ్లవర్ ఆయిల్ (1 లీటరు)
సాల్ట్
మిర్చి పౌడర్
పసుపు
చక్కెర
చింతపండు
జింజర్ గార్లిక్ పేస్ట్
మాస్కులు, శానిటైజర్లు.. వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

Akkineni fans

తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా కార్మికుల ఆకలి తీర్చడం చాలా ఆనందంగా ఉందని నాగ్ అభిమానులు తెలిపారు. ఈ కష్టకాలంలో నాగార్జున గారి ఫ్యాన్స్ సహాయం చేసినందుకు వారికి కృతజ్ఙతలు తెలిపారు థియేటర్లలో పనిచేసే కార్మికులు. దేవి థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అక్కినేని అభిమానులు పాల్గొన్నారు.