రూలర్ సినిమా లేటెస్ట్ రివ్యూ… ఫస్ట్ డే కలెక్షన్స్

బ్యానర్: హ‌్యాపీ మూవీస్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా `రూలర్`. ఈ ఏడాది రెండు ప్లాపులతో డీలాపడ్డ నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు ఫిక్స్ అయిన బాలకృష్ణ రూలర్ అంటూ మరో సినిమాను అందించాడు. అయితే ట్రైలర్, ప్రోమోలు బాలయ్య సినిమాపై అంచనాలు పెంచేయగా.. వారి అభిమానుల ఆశను బాలకృష్ణ నెరవేర్చాడా లేక రొటీ స్టోరీతో మళ్లీ వచ్చేశాడా? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ విషయానికి వస్తే… ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో గా జయసుధకు వారసుడిగా ఉంటున్న అర్జున్ ప్రసాద్ ..కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళితే అక్కడ సోనాల్ చౌహన్ తారసపడుతుంది. సోనాల్, అర్జున్ ప్రసాద్ కు పడిపోతుంది.వారి పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, అర్జున్ ప్రసాద్ కు, భవానీ నాథ్ అనే వ్యక్తితో గొడవ జరుగుతుంది. అర్జున్ ప్రసాద్ మీద అటాక్ చేయిస్తాడు భవానీ. అక్కడ కొన్ని ఊహించని పరిణామాలు అర్జున్ కు ఎదురవుతాయి. అప్పుడే అతని కి ఓ ప్లాష్ బ్యాక్ ఉన్నట్టు తెలుస్తుంది.. అక్కడందరూ ధర్మా అని పిలుస్తుంటారు. అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అర్జున్ ప్రసాద్ అలియాస్ ధర్మాకు ఉన్న ప్లాష్ బ్యాక్ ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
నటినటులు విషయానికి వస్తే ముందుగా నందమూరి బాలకృష్ణ గురించే ప్రస్తావించుకోవాలి. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడు. సినిమా అంతటా ఆయన చూపించిన ఎనర్జీ సినిమాకు ప్లస్ అయ్యింది. అటు డ్యాన్సుల్లో కానీ ఇటు ఫైట్స్ లో కానీ బాలయ్య ఎక్కడా తగ్గలేదు. తనకలవాటైన రీతిలో చెలరేగిపోయాడు. అలాగే ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించాడు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సీఈవోగా బాలయ్య లుక్ అదిరిపోయింది. రైతుగా.. పోలీస్ గా అదరగొట్టాడు బాలకృష్ణ
ఇక హీరోయిన్ సోనాల్ చౌహాన్ గ్లామర్ పరంగా అద్భతం చేసింది. ఆమె తన స్కిన్ షో తోనే జనాలను ఆకర్షిస్తుంది. పాత్ర పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించిన వేదిక ఆకట్టుకుంటుంది. అటు గ్లామరస్ గా ఉంటూనే, ఇటు పెర్ఫామెన్స్ కు స్కోప్ ున్న పాత్రలో మెప్పించింది. నాగినీడు, ప్రకాష్ రాజ్, జయసుధ ఎలాగు సీనియర్ యాక్టర్స్ కావడంతో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ముఖ్యా పాత్రలో నటించిన భూమిక బాగానటించింది. సప్తగిరి, సాయాజీ షిండే, ధనరాజ్, శ్రీనివాస రెడ్డి వంటి కామెడియన్స్ నవ్వించడానికి ప్రయత్నం చేశారు.
టెక్నీషయన్స్ విషయానికి వస్తే.. దర్శకుడిగా కెఎస్ రవికుమార్ కొత్తగా చేసిందేమి లేదు.. ఆయన అవుట్ డేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. మూస ఫార్మాట్ లోనే సినిమాను నడిపించాడు. మురళీ అందించిన కథ రొటీన్ గా అనిపిస్తుంది.. కమర్షియల్ సినిమా అనగానే పాట, ఫైటు అన్న తరహాలో ఉండాలని భావించి అదే వేలో సినిమాను తీసుకెళ్లారు.విజువల్స్ సినిమాకు మంచి ఎట్రాక్షన్ అయ్యాయి. ఫైట్స్, డాన్స్ లు బాగున్నాయి.పాటలు అంతగా బాలేకున్నా బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు చిరంతన్ భట్.నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా రైతుల కష్టాల మీద రాసిన డైలాగ్స్ బాగా పేలాయి.
ఓవరాల్‌గా చెప్పాలి అంటే.. రూలర్ అందరూ అనుకున్నట్టే.. రొటీన్ గానే ఉంది. ట్రైలర్ లో చూస్తేనే కథ మీద ఒక అంచనాకు రావొచ్చు. అంతకు మించి ఈ కథలో ఏం లేదు.అయితే బాలయ్య సినిమాను పైకి లేపడానికి బాగా ట్రై చేశాడు. మొత్తంగా రూలర్ బాలయ్య అభిమానులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైట్లు, గ్లామర్ విందు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం బి, సి సెంటర్ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి.
ఇక మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4.5 నుంచి 5 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఆరుకోట్ల వరకు ఈ సినిమా రాబట్టి ఉండవచ్చు అని అంటున్నారు.