Aishwarya Rai Bachchan : మరోసారి ఆ జంట విడాకుల పుకార్లు.. అసలేం జరుగుతోంది?
ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారా? గతంలోనూ ఇలాంటి వార్త వచ్చింది. తాజాగా మరోసారి ఇదే పుకారు రిపీట్ అవుతోంది. అయితే ఈసారి వచ్చిన వార్తల్లో నిజమెంత?

Aishwarya Rai Bachchan
Aishwarya Rai Bachchan : బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి వీరు విడిపోతున్నారంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు రావడం వెనుక నిజమెంత?
Sushmita and Rohman : దీపావళి పార్టీలో కలిసిన ఆ ఇద్దరూ.. పెళ్లి చేసుకోమని కోరుతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్స్‌లో ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్‌లు ఉంటారు. ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తారు. ఐశ్వర్య తన భర్తతో పాటు కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. రీసెంట్‌గా ఐశ్వర్య మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో మెరిశారు. పింక్ దుస్తుల్లో అందర్నీ ఆకట్టుకున్నారు. విషయం ఏంటంటే ఈ పార్టీలో అభిషేక్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ మాత్రం కనిపించలేదు. ఐశ్వర్య సోలో ఎంట్రీకి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్ ఈ పార్టీలో లేకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Maniratnam : కమల్ హాసన్ కోసం మణిరత్నం కాపీ కొట్టారా? KH234 ఆ సినిమాకు కాపీ అంటూ ట్రోల్స్..
దీపావళి పార్టీని నిర్వహించిన మనీష్ మల్హోత్రా బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఐశ్వర్యని తప్ప మిగిలిన వారిని ఆహ్వానించలేదా? లేక అభిషేక్, ఐశ్వర్య మధ్య రిలేషన్ అంత బాగా లేదా? అని అభిమానుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వీరి అనుమానాలకు ఊతమిచ్చే మరో సంఘటన జరిగింది. ఇటీవలే ఐశ్వర్య రాయ్ తన 50 వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. సియోన్ జీఎస్‌బీ సేవా మండల్‌ల్‌లోని క్యాన్సర్ పేషెంట్ల మధ్య ఐశ్వర్య ఈ వేడుక చేసుకున్నారు. ఈ వేడుకలో కూడా ఐశ్వర్య తల్లి బృందా రాయ్, కూతురు ఆరాధ్య మాత్రమే కనిపించారు. ఈ వేడుకలకు సైతం అభిషేక్ హాజరు కాకపోవడం.. ఐశ్వర్యకు పుట్టినరోజు విషెస్ చాలా లేట్‌గా చెప్పడం .. ఇవన్నీ గమనించిన ఫ్యాన్స్ అభిషేక్ తీరుని తప్పు పడుతున్నారు. అసలు ఈ జంటకు ఏమైందని ఆందోళన పడుతున్నారు.
View this post on Instagram