రుస్తుం ట్రైలర్ : అరెస్ట్ అంటే అలర్జీ, ఎన్‌కౌంటర్ అంటే ఎనర్జీ

  • Published By: sekhar ,Published On : April 26, 2019 / 10:05 AM IST
రుస్తుం ట్రైలర్ : అరెస్ట్ అంటే అలర్జీ, ఎన్‌కౌంటర్ అంటే ఎనర్జీ

Updated On : April 26, 2019 / 10:05 AM IST

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, శ్రద్ధ శ్రీనాథ్ (జెర్సీ ఫేమ్) జంటగా, రవివర్మ దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. రుస్తుం.. జయన్న కంబైన్స్ బ్యానర్‌పై జయన్న-భోగేంద్ర నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేసారు. ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దాటేసిందీ ట్రైలర్.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, మహేంద్రన్, మయూరి, రచితా రామ్ తదితరులు నటించిన రుస్తుం ట్రైలర్‌లో శివ రాజ్‌కుమార్ మరింత ఎనర్జీతో పర్ఫార్మ్ చేసాడు.

ఫైట్స్, పంచ్ డైలాగ్స్ శివన్న ఫ్యాన్స్‌ని మెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న రుస్తుం మే 17న గ్రాండ్‌గా రిలీజ్ అవనుంది. ఈ సినిమాకి సంగీతం : జె.అనూప్ సీలిన్, కెమెరా : మహేష్ సింహా, ఎడిటింగ్ : దీపు ఎస్ కుమార్..

వాచ్ రుస్తుం ట్రైలర్..