Sai Dharam Tej : అసలు ఎప్పుడు ఫోన్ చేయని పవన్.. తేజ్‌కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని.. పెద్ద షాక్ ఇచ్చాడట..!
ప్రస్తుతం బ్రో ప్రమోషన్స్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ప్రత్యేక విశేషాలు అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే అసలు ఎప్పుడు ఫోన్ చేయని పవన్ తనకి కాల్ చేసి..

Sai Dharam Tej about opportunity in Pawan Kalyan Bro movie
Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేస్తున్న సినిమా బ్రో (Bro). ఈ చిత్రం తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ తో తనకి ఉండే బాండింగ్ మరియు సినిమా గురించి కొన్ని విశేషాలు అభిమానులతో పంచుకున్నాడు. ఇక ‘బ్రో’ ప్రాజెక్ట్ తన వద్దకి ఎలా వచ్చిందో ఈ ఇంటర్వ్యూలో తేజ్ తెలియజేశాడు. “పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫోన్ రావడం చాలా అరుదు. అలాంటిది ఆయన దగ్గర నుంచి ఒక రోజు కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లో ఒకసారి ఇంటికి రా అని చెప్పారు” అంటూ తేజ్ చెప్పుకొచ్చాడు. అసలు ఎప్పుడు ఫోన్ చేయని పవన్ నుంచి కాల్ రావడంతో తేజ్ కూడా సస్పెన్స్ తో ఇంటికి వెళ్ళాడట.
సాయి ధరమ్ ఇంటికి వెళ్ళాక పవన్ మాట్లాడుతూ.. “ఒక సినిమా ఉంది. అది నువ్వు నేను చేస్తున్నాము. అందులో నువ్వు మెయిన్ లీడ్. నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తాను. సినిమా మొత్తం మన ఇద్దరి బాండింగ్ మీద ఉంటుంది. చాలా బాగుంటుంది” అని చెప్పాడట. అది విని తేజ్ షాక్ తిన్నాడట. ఆ రోజు అంతా ఆ షాక్ లోనే ఉన్నాడట. ఆలా తనకి బ్రో అవకాశం వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ముగ్గురు మావయ్యలతో కలిసి నటించాలనే కోరికలో.. నాగబాబు అండ్ పవన్ తో సినిమాలు అయ్యిపోయాయని. ఇంకా చిరంజీవితో కలిసి నటించాలనే కొరికే మిగిలిందని తేజ్ చెప్పుకొచ్చాడు.