Sai Dharam Tej : తిక్క హీరోయిన్‌తో లవ్ స్టోరీ గురించి తేజ్ కామెంట్స్.. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది..

తిక్క మూవీ హీరోయిన్ లారిస్సా బొనెసితో తేజ్ ప్రేమ వ్యవహారం కొన్నాళ్ల నుంచి వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రో మూవీ ప్రమోషన్స్ తేజ్ మాట్లాడుతూ..

Sai Dharam Tej : తిక్క హీరోయిన్‌తో లవ్ స్టోరీ గురించి తేజ్ కామెంట్స్.. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది..

Sai Dharam Tej comments about love story with Thikka heroine Larissa Bonesi

Updated On : July 27, 2023 / 4:45 PM IST

Sai Dharam Tej : 2016లో వచ్చిన ‘తిక్క’ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. ‘లారిస్సా బొనెసి’ (Larissa Bonesi) తో కలిసి నటించాడు. ఈ మూవీ సమయంలో తేజ్, లారిస్సాతో ప్రేమలో పడ్డాడని, తన ప్రేమని కూడా ఆమెకు తెలియజేశాడని వార్తలు వచ్చాయి. ఇక 2021లో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే రోజున లారిస్సా.. “నేను ప్రేమలో ఉన్నాను” అంటూ ట్వీట్ చేసింది. గత ఏడాది పుట్టినరోజున తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేయగా.. ‘టూ మై డిస్ట్రబన్స్‌’ అని ప్రేమగా రిప్లై ఇచ్చాడు మన హీరో. దీనికి లారిస్సా.. “ఎప్పటికి నిన్ను డిస్ట్రబ చేస్తూనే ఉంటా” అంటూ రిప్లై ఇచ్చింది.

Bholaa Shankar : రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా.. చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్..

దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో (Bro) ప్రమోషన్స్ లో ఉన్నాడు. దీంతో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తేజ్ అండ్ హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) సోషల్ మీడియా మీమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ మూవీ విషయాలతో పాటు పలు ఫన్నీ క్యూస్షన్ లు కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే ఒక మీమర్, తేజ్‌ని.. “లారిస్సా వదిన ఎలా ఉంది అన్న” అంటూ ప్రశ్నించాడు.

Spy Movie : ఏ ప్రకటన లేకుండా ఓటీటీకి వచ్చేసిన నిఖిల్ స్పై.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

ఈ ప్రశ్నకు తేజ్ బదులివ్వకుండా కాసేపు మౌనంగా ఉండి, ఆ తరువాత.. ‘క్యూస్షన్ ఏంటి నాకు సరిగా అర్ధం కాలేదు” అంటూ మళ్ళీ అడిగాడు. మీమర్ మళ్ళీ ఆ క్యూస్షన్ ని రిపీట్ చేయగా తేజ్ మళ్ళీ మౌనం పాటించి క్యూస్షన్ అర్ధం కాలేదంటూ బదులిచ్చాడు. ఇక ఈ వరుస చూసిన కొందరు మీమ్ లాంగ్వేజ్ లో ‘కమల్ హాసన్’ అంటూ కామెడీ చేశారు. దానికి తేజ్ బదులిస్తూ.. “లారిస్సా పేరులో ఉన్న వైబ్రేషన్ అలాంటిది” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.