Sai Dharam Tej : అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో సాయిదరమ్ తేజ్ ప్రత్యేక పూజలు..
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సాయిదరమ్ తేజ్.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మెయిన్ లీడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘బ్రో’. సోషియో ఫాంటసీ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. దీంతో సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్స్ లో తెగ సందడి చేస్తున్నాడు.
Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమా గ్లింప్స్ పై సెలబ్రిటీస్ ట్వీట్స్..
ఈ క్రమంలోనే ఇటీవల తిరుపతి వెళ్లిన తేజ్.. అక్కడ పరిసర ప్రాంతాల ప్రసిద్ధి దేవాలయాలని సందర్శించి పూజలు నిర్వహించాడు. తాజాగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నాడు. సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సాయి దరమ్ తేజ్.. తన హెల్త్ గురించి స్వామిని వేడుకున్నట్లు, అలాగే అందరూ బావుండాలని కూడా కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. 2014 లో అరసవల్లి దేవాలయానికి వచ్చినట్లు మళ్ళీ ఇన్నాళ్ల తరువాత వచ్చినట్లు పేర్కొన్నాడు. అలాగే బ్రో మూవీ గురించి మాట్లాడుతూ.. “నేను మా గురువు గారు కలసి సినిమా చేశాం. ఆడియన్స్ అంచనాలకు కచ్చితంగా రీచ్ అవుతాం. ప్యాన్స్ అనుకున్న దానికంటే బ్రో సినిమా ఎక్కువ బావుంటుంది” అని తెలియజేశాడు.
Prabhas : హాలీవుడ్ స్టేజిపై ఇండియన్ కల్చర్‌తో ప్రాజెక్ట్ K లాంచింగ్.. ప్రభాస్‌ని పరిచయం చేసిన రానా..
కాగా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురై కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన సంగతాగి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి తేజ్ ఇంకా కోలుకోలేదట. దీంతో బ్రో మూవీ రిలీజ్ తరువాత 6 నెలలు పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ఈ మూవీ ప్రమోషన్స్ లో తెలియజేశాడు. ఈ గ్యాప్ లో మరో చిన్న సర్జరీ కూడా చేయించుకోబోతున్నట్లు వెల్లడించాడు.