Sai Dharam Tej : మెగా హీరో అవుట్ ఆఫ్ డేంజర్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి.

Sai Dharam Tej : మెగా హీరో అవుట్ ఆఫ్ డేంజర్

Sai Dharam Tej Safe

Updated On : September 10, 2021 / 11:43 PM IST

Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లాడు. తేజ్ ను వెంటనే హైటెక్ సిటీలోని మెడీకవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్పారు. అయితే, ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, తేజ్ కుటుంబసభ్యులు మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

మెరుగైన చికిత్స కోసం తేజ్ ను జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తేజ్ నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ వేగంగా వెళ్తున్న సమయంలో స్కిడ్ అయ్యింది. తేజ్ బండి నెంబర్ TS07 GJ1258. ఇటీవలే తేజ్ ఆ స్పోర్ట్స్ బైక్ కొన్నాడు.

కాగా, అతి వేగమే ప్రమాదానికి కారణం అని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బైక్ వేగం 120 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్లు ఉన్నట్టు సమాచారం. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, హెల్మెట్ పెట్టుకోవడం వల్లే తలకు స్వల్పంగా గాయాలైనట్టు చెబుతున్నారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు డాక్టర్లు స్కాన్‌ చేస్తున్నారు.