Virupaksha: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న విరూపాక్ష

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’కు సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.

Virupaksha: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న విరూపాక్ష

Sai Dharam Tej Virupaksha Locks OTT Partner

Updated On : April 21, 2023 / 4:04 PM IST

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించగా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సాలిడ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Virupaksha: విరూపాక్ష చూస్తే కాంతార కాదు.. ఆ సినిమా గుర్తుకొస్తుందట!

ఈ సినిమాలోని థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమా తాజాగా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ‘విరూపాక్ష’ డిజిటల్ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ పార్ట్‌నర్‌గా మారింది.

Virupaksha : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ తో అదరగొట్టేసిన విరూపాక్ష.. థియేటర్లలో భయపడుతున్న ప్రేక్షకులు.. ట్విట్టర్ రివ్యూ..

ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.