Neha Shetty : మొన్న సాయి దుర్గ తేజ్.. నేడు నేహా శెట్టి.. ప్రభాస్ విషయమే క్లారిటీ రావాలి..

తల్లి మీద ప్రేమతో సాయి దుర్గ తేజ్, తండ్రి మీద ప్రేమతో నేహశెట్టి పేర్లు మార్చుకున్నారు. ఇక ప్రభాస్ విషయమే క్లారిటీ రావాలి.

Neha Shetty : మొన్న సాయి దుర్గ తేజ్.. నేడు నేహా శెట్టి.. ప్రభాస్ విషయమే క్లారిటీ రావాలి..

Sai Durga Tej Neha Shetty changing their names to show respect on their parents

Updated On : March 29, 2024 / 6:00 PM IST

Neha Shetty : సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు పేర్లు మార్చుకోవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంటుంది. తమ గురువు పై, లేదా ఫ్యామిలీ వ్యక్తి పై ప్రేమను చాటుకునేందుకు.. కొందరు పేరు మార్చుకుంటుంటారు. మరికొందరు అదృష్టం కోసం ఛేంజ్ చేసుకుంటారు. ఇంకొందరు తమకి బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా లేదా పాత్ర పేరుని తమ ఇంటి పేరుగా మార్చేసుకుంటారు.

ఇలా ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ పేర్లు మార్చుకున్నవారు ఉన్నారు. ఈక్రమంలోనే విశ్వక్ సేన్ అదృష్టం కోసం తన పేరుని మార్చుకుంటే.. సాయి ధరమ్ తేజ్ తన తల్లి పై ప్రేమను తెలుపుకునేందుకు పేరుని మార్చుకున్నారు. మొన్నటివరకు సాయి ధరమ్ తేజ్ గా అందర్నీ పలకరించిన తేజ్.. ఇటీవల తన పేరుని మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. తన తల్లి పై ప్రేమతో.. ఆమె పేరుని తన పేరులో యాడ్ చేసుకొని ‘సాయి దుర్గ తేజ్’గా మారుతున్నాను అని వెల్లడించారు.

Also read : Allu Arjun : పదిహేనేళ్ల క్రితం అలా వెళ్ళాము.. ఇప్పుడు ఇలా.. గర్వంతో అల్లు శిరీష్, స్నేహ పోస్టులు..

ఇక రీసెంట్ గా హీరోయిన్ నేహశెట్టి కూడా తన పేరుని మార్చుకున్నట్లు తెలుస్తుంది. డీజే టిల్లు సినిమాలో రాధికగా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న నేహా.. టిల్లు స్క్వేర్ లో గెస్ట్ రోల్ చేసి అదరగొట్టారు. ఇక ఈ మూవీ టైటిల్స్ లోనే ఈ హీరోయిన్ పేరుని ‘నేహా హరిరాజ్ శెట్టి’ అని వేశారు. నేహా తండ్రి పేరు హరిరాజ్ శెట్టి. తల్లి మీద ప్రేమతో తేజ్ చేసినట్లు, నేహా కూడా తండ్రి మీద ప్రేమతో చేసినట్లు తెలుస్తుంది.

కాగా ఇటీవల ప్రభాస్ కూడా తన పేరులో కొంచెం మార్పు చేసినట్లు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘రాజాసాబ్’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ లో ప్రభాస్ పేరుని ఇంగ్లీష్ వేశారు. అయితే ఆ పేరులో ఎక్స్‌ట్రాగా మరో ‘S’ పెట్టారు. అంతకుముందు Prabhas అని మాత్రమే రాసేవారు. కానీ ఆ పోస్టర్ లో Prabhass అని వేశారు. దీంతో ప్రభాస్ పేరు మార్చుకుంటున్నారు అనే డౌట్ వచ్చింది. దీని పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.