SDT 18 Making Video : సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్.. SDT 18 మేకింగ్ వీడియో రిలీజ్.. ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా..

నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా SDT18 సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

SDT 18 Making Video : సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్.. SDT 18 మేకింగ్ వీడియో రిలీజ్.. ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా..

Sai Durgha Tej SDT 18 Making Video Released on his Birthday

Updated On : October 15, 2024 / 11:26 AM IST

SDT 18 Making Video : సాయి దుర్గా తేజ్ ‘బ్రో’ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు SDT18 సినిమాతో రాబోతున్నాడు. హనుమాన్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది సమాచారం. నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా SDT18 సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

Also Read : Sai Durgha Tej : పడి లేచిన కెరటం.. సాయి దుర్గా తేజ్.. 100 కోట్ల సినిమాతో గ్రాండ్ కంబ్యాక్.. బర్త్ డే స్పెషల్..

ఈ వీడియో చూస్తుంటే ఇదేదో భారీగానే ప్లాన్ చేస్తున్నారని అర్ధమవుతుంది. పీరియాడిక్ లుక్ లో భారీ యాక్షన్ సినిమాగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ బాడీ కూడా బాగా పెంచడాన్ని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ వీడియో చివర్లో చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంటున్నారు. మీరు కూడా SDT18 మేకింగ్ వీడియో చూసేయండి..