Sai Kumar : ‘ప్రణయగోదారి’ నుంచి సాయికుమార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..
తాజాగా 'ప్రణయగోదారి' సినిమా నుంచి సాయికుమార్ పవర్ ఫుల్ లుక్ విడుదల చేసారు.

Sai Kumar First Look Released from Pranaya Godari Movie by Komatireddy Rajagopal Reddy
Sai Kumar : కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ ప్రణయగోదారి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా PL విఘ్నేష్ దర్శకత్వంలో పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్.. పలువురు నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ‘ప్రణయగోదారి’ సినిమా నుంచి సాయికుమార్ పవర్ ఫుల్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో సాయి కుమార్ పెదకాపు అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. సాయి కుమార్ ఫస్ట్ లుక్ ని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా మునుగోడుకి చెందిన పారుమళ్ళ లింగయ్య సినిమా నిర్మాణంలోకి వచ్చి ప్రణయగోదారి సినిమాని నిర్మిస్తున్నందుకు అభినందనలు. ఆయనకు నా సహకారం ఎప్పుడూ వుంటుంది. ఈ సినిమా మంచి హిట్ అయి భవిష్యత్‌లో లింగయ్య మరిన్ని సినిమాలు చేయాలి అని అన్నారు.
Also Read : Aarambham : ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ ‘ఆరంభం’..
సినిమా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. సాయికుమార్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, మా కంటెంట్‌ను మెచ్చుకొని అభినందించిన మునుగోడు ఎమ్మేల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు సినిమాలో కనిపిస్తాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అని తెలిపారు.