Chowkidar : చౌకీదార్ సినిమా నుంచి సాయి కుమార్ నాన్న ఎమోషనల్ సాంగ్ రిలీజ్..
తాజాగా చౌకీదార్ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Sai Kumar Pruthvi Ambaar Chowkidar Movie Father Emotional Song Released
Chowkidar : పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘చౌకీదార్’. సాయి కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డా.కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మాణంలో చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను బైలింగ్వల్ గా తెరకెక్కిస్తున్నారు.
తాజాగా చౌకీదార్ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా ఈ పాట ఉంది. ‘నాన్నా అంటే మొదటి దైవం..’ అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా సచిన్ బస్రూర్ సంగీత దర్శకత్వంలో విజయ్ ప్రకాష్ పాడారు. ఈ సినిమాలో పృథ్వీ అంబర్, సాయి కుమార్ మధ్య మంచి తండ్రి కొడుకు ఎమోషనల్ సీన్స్ ఉండేలా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.
నాన్న ఎమోషనల్ సాంగ్ మీరు కూడా వినేయండి..