Ram Charan : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి.. నిజమేనా..?
రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించబోతున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త..

Sai Pallavi is really casting in Ram Charan RC16 movie
Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని తెరకెక్కించారు. బుచ్చిబాబు ఇటీవల జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చూస్తున్న మేకర్స్.. నటీనటులను సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించేందుకు ఏ ఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.
మూవీలోని ఒక ముఖ్య పాత్ర కోసం విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు హీరోయిన్ గురించిన ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఆమధ్య ఒక బాలీవుడ్ భామకి స్క్రీన్ టెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త హల్‌చల్ చేస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, చరణ్ ఫ్యాన్స్ ని మాత్రం ఇది ఫుల్ ఖుషీ చేస్తుంది.
Also read : Rashmika : రష్మిక ఫేక్ వీడియో పై మాట్లాడిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్..
ఎందుకంటే, రామ్ చరణ్ ఫేవరెట్ యాక్ట్రెస్ సాయి పల్లవి. రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరోయిన్ తో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుండడంతో.. ఇది నిజం అవ్వాలని ఆశ పడుతున్నారు. మరి ఈ వార్త పై బుచ్చిబాబు ఒక క్లారిటీ ఇచ్చి అభిమానులను ఖుషీ చేస్తారా..? అనేది చూడాలి. కాగా గేమ్ ఛేంజర్ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది. దీంతో RC16 ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే దాని పై క్లారిటీ రావడం లేదు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
RamCharan SaiPallavi ARR VJS #RC16
Buchi idhi nijam ayithey matram ???????I am the most happiest ? pic.twitter.com/Olgj40tc5G
— Potatoes ? (@Itz_Pravz) November 16, 2023