కత్తిపోట్ల ఘటన జరిగినప్పుడు నువ్వు చనిపోతావా నాన్నా అని నా కొడుకు అడిగాడు.. ఆ క్షణంలో.. సైఫ్ ఎమోషనల్
సైఫ్ అలీ ఖాన్ ఇంటర్వ్యూలో మరో విషయాన్ని బయటపెట్టాడు.

సైఫ్ అలీ ఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన సమయంలో చోటుచేసుకున్న మరో ఆసక్తికర అంశం తాజాగా బయటకు వచ్చింది. తాజాగా, సైఫ్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన ఇంటికి చోరీ కోసం వచ్చిన దుండగుడు తనను కత్తితో పొడిచినప్పటికీ తాను అంతగా భయాందోళనలు చెందలేదని అన్నాడు.
కాసేపయ్యాక నొప్పి బాగా పెరగడంతో అతడు ఎంతటి పోటు పొడిచాడో తెలియవచ్చిందని సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. దుండగుడు తన వెన్నులో కత్తితో దాడి చేశాడని, కరీనా చాలా ఆందోళన చెందిందని అన్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపాడు.
తన భార్య తమ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఫోన్ చేసిందని, అయితే, అంత చీకటిలో ఎవరూ స్పందించలేదని సైఫ్ అలీ ఖాన్ చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లాలని కరీనా కాల్స్ టెన్షన్ పడుతూ ఫోన్లు చేసిందని, ఆమెను తాను ధైర్యం చెప్పానని అన్నాడు.
Also Read: ట్రంప్ రూట్‌లో యూకే… ఇండియన్ రెస్టారెంట్లలో వేట.. అక్రమ వలసదారులు ఉంటే..
అప్పుడు తన కుమారుడు తైమూర్ తన దగ్గరకు వచ్చాడని, నువ్వు చనిపోతావా అని ప్రశ్నించాడని సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. ఆ సమయంలో కళ్లలో నీళ్లు వచ్చాయని చెప్పాడు. అటువంటి దురదృష్ట ఘటన ఏమీ జరగదని తాను తన కుమారుడికి చెప్పానని, అమ్మ ఉందని ధైర్యం చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అన్నాడు. తాను ఆసుపత్రికి వెళ్తుండగా తన కుమారుడూ వచ్చాడని తెలిపాడు.
తాను కూడా తైమూర్‌ను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలనే భావించానని సైఫ్ అలీ ఖాన్ చెప్పాడు. తనకు ఏమైనా జరిగితే తన కొడుకు తన పక్కనే ఉండాలని అనిపించిందని అన్నాడు. ఆ సమయంలో తన చిన్న కుమారుడు జెహ్.. కరీనా వద్దే ఉన్నాడని చెప్పాడు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాతే తన గాయాల తీవ్రతను గుర్తించానని సైఫ్ తెలిపాడు.
దాదాపు నాలుగు అంగుళాల కత్తి సైఫ్ వెన్నులో దిగింది. సైఫ్ అలీ ఖాన్‌కు దాదాపు ఆరు గంటల పాటు ఆపరేషన్ జరిగింది. అతడిపై బాంద్రాలోని గత నెల 16న దాడి జరిగింది. తనపై దాడి జరగక ముందు తాను, కరీనా తమ గదిలో నిద్రపోతున్నామని గుర్తుచేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. తెల్లవారుజామున 2 గంటలకు దుండగుడు ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపాడు.