Salaar – The Vaccine War : మళ్ళీ వార్ ఫిక్స్.. ‘సలార్’ వర్సెస్ ‘ది వ్యాక్సిన్ వార్’.. ప్రభాస్ వర్సెస్ వివేక్ రంజన్..

సలార్ పార్ట్ 1 Ceasefire సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. అయితే అదే రోజు బాలీవుడ్(Bollywood) దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri) ది వ్యాక్సిన్ వార్ సినిమాతో రాబోతున్నాడు.

Salaar – The Vaccine War : మళ్ళీ వార్ ఫిక్స్.. ‘సలార్’ వర్సెస్ ‘ది వ్యాక్సిన్ వార్’.. ప్రభాస్ వర్సెస్ వివేక్ రంజన్..

Salaar and The Vaccine War movies releasing on same date Prabhas Vs Vivek Ranjan Agnihori again

Updated On : August 15, 2023 / 12:43 PM IST

Salaar – The Vaccine War :  ప్రభాస్(Prabhas) అభిమానులు ప్రస్తుతం సలార్ రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అదిరిపోవడం, అంతేకాకుండా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా సలార్ మొదటి పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సలార్ పార్ట్ 1 Ceasefire సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.

అయితే అదే రోజు బాలీవుడ్(Bollywood) దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri) ది వ్యాక్సిన్ వార్ సినిమాతో రాబోతున్నాడు. ది వ్యాక్సిన్ వార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుందని నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఎలాంటి స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. కానీ ఇది ఎందుకు ఇంత ప్రత్యేకత తెచ్చుకుంది, ప్రభాస్ సినిమాతో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే అందుకు కారణం కంటెంట్. ది వ్యాక్సిన్ వార్ సినిమా కరోనా వచ్చిన తర్వాత పరిస్థితుల గురించి ఉండబోతుంది. మంచి కంటెంట్ సినిమా అని ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ది వ్యాక్సిన్ వార్ సినిమాలో నానా పటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ, అనుపమ్ ఖేర్ నటించనున్నారు. దీనిపై అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి.

Rana Daggubati : మొన్న బాలీవుడ్ హీరోయిన్‌ని తిట్టి.. ఇవాళ క్షమాపణలు చెప్పిన రానా..

వివేక్ రంజన్ అగ్నిహోత్రి గత సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధించాయి. గత సంవత్సరం ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశమంతటా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా గత సంవత్సరం 2022 మార్చి 11న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. అదే రోజు రిలీజయిన ప్రభాస్ రాధేశ్యామ్ ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ – వివేక్ రంజన్ ఒకే రోజు తమ సినిమాలతో వస్తుండటంతో ఈ సారి కూడా మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సారి మాత్రం ది వ్యాక్సిన్ వార్ హిట్ అయినా సలార్ అంతకంటే పెద్ద హిట్ అవుతుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.