Rana Daggubati : మొన్న బాలీవుడ్ హీరోయిన్‌ని తిట్టి.. ఇవాళ క్షమాపణలు చెప్పిన రానా..

రానా చెప్పింది సోనమ్ కపూర్(Sonam Kapoor) గురించి అని తెలియడంతో ఈ వార్త వైరల్ అయింది. బాలీవుడ్ లో కూడా రానా సోనమ్ కపూర్ మీద ఫైర్ అయ్యాడని వార్తలు రాశారు.

Rana Daggubati : మొన్న బాలీవుడ్ హీరోయిన్‌ని తిట్టి.. ఇవాళ క్షమాపణలు చెప్పిన రానా..

Rana Daggubati says sorry to Sonam Kapoor and Dulquer Salman by Tweet

Updated On : August 15, 2023 / 12:16 PM IST

Rana Daggubati :  ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కింగ్ అఫ్ కోత(King of Kotha) సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి రానా(Rana), నాని(Nani) ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఓ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ గురించి విమర్శలు చేశాడు. దుల్కర్ తో ఓ బాలీవుడ్ హీరోయిన్ సినిమా చేసిందని, ఆమె సినిమా చేసేటప్పుడు దుల్కర్ ని చాలా ఇబ్బంది పెట్టిందని, షూటింగ్ మధ్యలో ఫోన్స్ మాట్లాడుకుంటుందని, ఈ విషయంలో నిర్మాతలని తిట్టానని రానా చెప్పాడు.

దీంతో రానా వ్యాఖ్యలు వైరల్ అవ్వగా దుల్కర్ ని అంతలా నిలబెట్టిన ఆ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ ఎవరా అని ఆరా తీశారు. దుల్కర్ చేసిన హిందీ సినిమాల లిస్ట్ తీసి అందులో హీరోయిన్స్ లిస్ట్ చూస్తే రానా చెప్పింది సోనమ్ కపూర్(Sonam Kapoor) గురించి అని తెలియడంతో ఈ వార్త వైరల్ అయింది. బాలీవుడ్ లో కూడా రానా సోనమ్ కపూర్ మీద ఫైర్ అయ్యాడని వార్తలు రాశారు. అయితే ఈ వార్తలు సోనమ్ వరకు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఇవాళ ఉదయం రానా సోనమ్ కపూర్ కి, దుల్కర్ కి క్షమాపణలు చెప్తూ, వార్తలని నెగిటివ్ గా పబ్లిష్ చేసారంటూ ఓ ట్వీట్ చేశాడు.

Gangs of Godavari : విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. సుట్టంలా సూసి..

రానా తన ట్వీట్ లో.. నేను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె కూడా నా స్నేహితురాలే. నేను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాను. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకొని ప్రమోట్ చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను గౌరవంగా భావించే సోనమ్ కపూర్ కి, దుల్కర్ సల్మాన్ కి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియచేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ఊహాగానాలకు, వార్తలకు ముగింపు పలకాలని కోరుకుంటున్నాను. అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు అని తెలిపాడు. దీంతో ఈ ట్వీట్ మరింత వైరల్ అయింది. మొన్నేమో అలా సోనమ్ గురించి చెప్పి ఇప్పుడేమో ఇలా సారీ చెప్తూ ట్వీట్ చేయడంతో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.