Prabhas : ‘సలార్’ సక్సెస్‌తో.. మంగళూరు దగ్గర్లోని ప్రముఖ ఆలయంలో ప్రభాస్..

ప్రభాస్ బయట చాలా తక్కువగా కనిపిస్తాడని తెలిసిందే. సలార్ కి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఇటీవల బయట ఎక్కడా కనపడలేదు.

Prabhas : ‘సలార్’ సక్సెస్‌తో.. మంగళూరు దగ్గర్లోని ప్రముఖ ఆలయంలో ప్రభాస్..

Salaar Prabhas Prashanth Neel Visited Sri Durga Parameshwari Temple Kateel Near Mangalore

Updated On : January 12, 2024 / 7:31 PM IST

Prabhas : ప్రభాస్ ఇటీవల సలార్(Salaar) సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సలార్ సినిమాతో ఏకంగా ఇప్పటిదాకా 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అదరగొట్టాడు ప్రభాస్. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టాడు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ప్రభాస్ బయట చాలా తక్కువగా కనిపిస్తాడని తెలిసిందే. సలార్ కి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఇటీవల బయట ఎక్కడా కనపడలేదు. సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ చిత్రయూనిట్ గ్రాండ్ గా నిర్వహించగా ప్రభాస్ హాజరయ్యాడు. అయితే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా కేవలం చిత్రయూనిట్ వరకే ప్రైవేట్ గా నిర్వహించారు.

తాజాగా ప్రభాస్ బయటకి వచ్చాడు. సలార్ నిర్మాతలు హోంబేలె సంస్థ కర్ణాటక సంస్థ అని తెలిసిందే. సలార్ సినిమా భారీ విజయం సాధించడంతో నిర్మాత, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, మరికొంతమంది కలిసి నేడు సాయంత్రం మంగళూరు దగ్గర్లో కాటెల్ అనే ఊళ్ళో ఉన్న శ్రీ దుర్గ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అధికారులు, పూజారులు అమ్మవారి పటం, ప్రసాదం ప్రభాస్ కి అందచేసి ఆశీర్వదించారు.

Also Read : Guntur Kaaram OTT : ‘గుంటూరు కారం’ ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?

దీంతో ప్రభాస్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ కళ్ళజోడు పెట్టుకొని, తలపై క్యాప్ పెట్టుకొని, మాస్క్ తో వైట్ హుడి, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. దీంతో ప్రభాస్ చాలా రోజుల తర్వాత బయటకి వచ్చాడని ఈ ఫొటోలు మరింత వైరల్ అవుతున్నాయి.