Guntur Kaaram OTT : ‘గుంటూరు కారం’ ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?

గుంటూరు కారం సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా ముందే భారీ ధరకు అమ్ముడుపోయాయి.

Guntur Kaaram OTT : ‘గుంటూరు కారం’ ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie OTT and Satellite Partners Full Details Here

Updated On : January 12, 2024 / 6:40 PM IST

Guntur Kaaram OTT Partner : మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురు చూసిన గుంటూరు కారం సినిమా ధియేటర్లలో సందడి చేస్తోంది. భారీగా అంచనాల నడుమ శుక్రవారం (జనవరి 12న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ అమితాసక్తి చూపిస్తుండడంతో ధియేటర్లు అన్నీ ఫుల్ అయ్యాయి. సంక్రాంతి సెలవులు కావడంతో మరికొన్ని రోజులు ఈ సందడి కొనసాగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు.

గుంటూరు కారం సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో మాత్రం చెప్పలేదు. మార్చి నెల మొదట్లో లేదా ఫిబ్రవరి చివర్లో గుంటూరు కారం సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అలాగే గుంటూరు కారం శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ భారీ ధరకు కొనుక్కుందని టాలీవుడ్ టాక్.

Also Read :  అమెరికాకు ‘గుంటూరు కారం’ ఘాటు.. మహేష్ సరికొత్త రికార్డ్.. వరుసగా 12వ సినిమా..