Prabhas : జపాన్ అభిమానుల.. ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ చూశారా..?
ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జపాన్ అభిమానులు ఎలా జరుపుకుంటున్నారో చూశారా..?

Salaar star Prabhas birthday celebrations by Japan Fans
Prabhas : ఈసారి దసరా పండుగతో పాటు ప్రభాస్ పుట్టినరోజు వేడుక కూడా రెబల్ అభిమానులకు కలిసొచ్చింది. దీంతో ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఫ్యాన్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ని రీ రిలీజ్ చేసి సందడి చేయనున్నారు. అలాగే బ్యానర్స్, సేవ కార్యక్రమాలు, కేక్ కటింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల యూత్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు.
ఇక ఇక్కడి సెలబ్రేషన్స్ ఇలా ఉంటే, జపాన్ అభిమానులు కూడా అదే రీతిలో సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్కడి ఫ్యాన్స్.. ఒక రూమ్ మొత్తాన్ని ప్రభాస్ ఫొటోలతో నింపేశారు. ఇక ఫోటోలకు పూలదండలు వేసి, ప్రసాదాలు పెట్టి ఒక పండగలా నిర్వహిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Also read : Bhagavanth Kesari : మూడు రోజుల భగవంత్ కేసరి కలెక్షన్స్.. ఈసారి సెంచరీ..!
కాగా ఈ పుట్టినరోజు కానుకగా ప్రభాస్ సినిమాల నుంచి ఏమన్నా అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న టీజర్ తప్ప మరేమీ రిలీజ్ కాలేదు. ఈ బర్త్ డేకి అయినా ఏమన్నా అప్డేట్ వస్తుందా అని అనుకుంటే మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు చిత్ర యూనిట్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.