Prabhas : మారుతి సినిమా నుంచి ప్రభాస్ కొత్త ఫోటోలు లీక్.. వింటేజ్ లుక్‌లోకి వచ్చేశాడుగా..
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుంచి కొత్త ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ పిక్స్ లో ప్రభాస్ లుక్స్..

Salaar star Prabhas new photos leak from Maruthi movie
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ షూటింగ్ మాత్రం జరుపుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలార్, కల్కి సినిమా షూటింగ్స్ కి బ్రేక్ వచ్చిన సమయంలో.. ఈ మూవీ సెట్స్ లోకి ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ప్రభాస్ మళ్ళీ ఈ సెట్స్ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మూవీ సెట్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యి నెట్టింట వైరల్ గా మారాయి.
గతంలో లీక్ అయిన పిక్స్‌ని చూసే అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఒకప్పుడు ప్రభాస్ మళ్ళీ కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా లీక్ అయిన లుక్స్ చూసి మరింత ఖుషి అవుతున్నారు. ఈ పిక్స్ లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘ఏక్ నిరంజన్’ సినిమా లుక్ లో ప్రభాస్ ఆ ఫొటోల్లో కనిపిస్తున్నాడు. అలాగే ఈ మూవీలోని డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రభాస్ పై ఒక చిన్న ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది లీక్ అయిన పిక్స్ చూస్తుంటే.
Also read : Prabhas : ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. డిలీట్ అయ్యిందా..? హ్యాక్ అయ్యిందా..?
Vintage prabhas ??
6sec video Leaked ?
RT kottu DM pattu#Prabhas #Rajadelux pic.twitter.com/Ld1K9m0BCM— ʀᴀɢʜᴜ? (@raghu003__) October 14, 2023
ఈ నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనుందని దర్శకుడు మారుతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఈ చిత్రాన్ని హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తో ఈ సినిమాలో మంచి కామెడీ పండించబోతున్నాడట మారుతి. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గానే తెరకెక్కిస్తున్నారు.