Salman Khan : మళ్ళీ తన వ్యాధి గురించి మాట్లాడిన సల్మాన్ ఖాన్.. పాపం కండల వీరుడు నొప్పితో ఇంకా బాధపడుతూ..

గతంలో సల్మాన్ ఖాన్ తనకు ట్రైజెమినల్ న్యూరల్జియా అనే వ్యాధి ఉందని ఓ ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పాడు. (Salman Khan)

Salman Khan : మళ్ళీ తన వ్యాధి గురించి మాట్లాడిన సల్మాన్ ఖాన్.. పాపం కండల వీరుడు నొప్పితో ఇంకా బాధపడుతూ..

Salman Khan

Updated On : September 29, 2025 / 3:17 PM IST

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 59 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయాడు. సల్మాన్ కి ఓ గ్యాంగ్ నుంచి థ్రెట్ కూడా ఉంది. ఆ థ్రెట్ తోనే బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వాడుతూ, అవసరం అయితే తప్ప ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటూ భయపడుతూ బతుకుతున్నాడు సల్మాన్ ఖాన్.(Salman Khan)

గతంలో సల్మాన్ ఖాన్ తనకు ట్రైజెమినల్ న్యూరల్జియా అనే వ్యాధి ఉందని ఓ ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పాడు. తాజాగా మరోసారి దాని గురించి మాట్లాడాడు సల్మాన్. టూ మచ్ విత్ ట్వింకల్ అండ్ కాజోల్ టాక్ షోలో సల్మాన్ ఖాన్ మరోసారి తన వ్యాధి గురించి చెప్పాడు.

Also Read : OG Collections : అదరగొడుతున్న పవర్ స్టార్ OG కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ ఎన్ని కోట్లు..?

సల్మాన్ ఖాన్ తనకు ఉన్న వ్యాధి గురించి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ట్రైజెమినల్ న్యూరల్జియాతో నేను బాధపడుతున్నాను. దీనివల్ల సూసైడ్ ఆలోచనలు కూడా వస్తున్నాయి. దీనివల్ల ముఖంలో బాగా నొప్పి వస్తుంది. ముఖం నుంచి మెదడుకు సమాచారం అందించే ట్రైజెమినల్ అనే నాడిని ఇది తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనివల్ల నమిలినా, మాట్లాడినా, ఒక్కోసారి ముఖాన్ని తాకినా కూడా బాగా నొప్పి వస్తుంది. ఒక్కోసారి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ముఖం తిప్పినప్పుడు కూడా ఎముకల శబ్దాలు వస్తుంటాయి. 2007లో ఓ సినిమా చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు బయటపడ్డాయి. 2011 లో అమెరికా వెళ్లి దీని కోసం చికిత్స చేయించుకున్నాను కానీ అది పూర్తిగా నయమవ్వలేదు. దానికి సరైన మందు లేదు. ఇది ఎందుకు వస్తుందో కారణం తెలీదు. ఇప్పటికి ఆ వ్యాధితో బాధపడుతున్నాను. ఒక్కోసారి ముఖం మీద గట్టిగా కొడితే వచ్చేంత నొప్పి వస్తుంది అని తెలిపాడు.

దీంతో పాపం కండల వీరుడు ఇంత స్టార్ డమ్ ఉండి, ఇన్ని కోట్లు ఉన్నా తన వ్యాధిని నయం చేసుకోలేకపోతున్నాడు అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Also Read : Rashmika Mandanna : బాబోయ్.. బాలీవుడ్ లో రష్మిక మందన్న హాట్ సాంగ్ చూశారా?