Salman Khan : హాలీవుడ్ సినిమాని ప్రమోట్ చేస్తున్న సల్మాన్ ఖాన్.. ఇండియన్ మార్కెట్ మీద బాగా ఫోకస్ చేశారుగా..

తాజాగా మరో హాలీవుడ్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇండియాలో. మార్వెల్(Marvel) యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతుంది.

Salman Khan : హాలీవుడ్ సినిమాని ప్రమోట్ చేస్తున్న సల్మాన్ ఖాన్.. ఇండియన్ మార్కెట్ మీద బాగా ఫోకస్ చేశారుగా..

Salman Khan Promotes Hollywood Movie Guardians of the Galaxy Movie in India

Updated On : May 2, 2023 / 12:54 PM IST

Salman Khan :  ఇండియాలో(India) హాలీవుడ్(Hollywood) సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. దాదాపు అన్ని హాలీవుడ్ సినిమాలు ఇక్కడ ఇండియాలో భారీగానే రిలీజవుతాయి. అయితే అంతకుముందు సినిమా రిలీజ్ అవుతున్నా ఎక్కువగా ప్రమోషన్స్ చేసేవారు కాదు. కానీ ఇటీవల ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడంతో, ముఖ్యంగా RRR సినిమా వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకోవడంతో ఇండియాలో హాలీవుడ్ సినిమాలను ప్రమోట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా మరో హాలీవుడ్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇండియాలో. మార్వెల్(Marvel) యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా మొదటి వాల్యూమ్ 2014 లో, రెండవ వాల్యూమ్ 2017 లో రిలీజయ్యాయి. వీటికి ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతుంది. మే 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇండియాలో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఇండియాలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని వాడుతున్నారు. సల్మాన్ చేస్తున్నాడంటే ఏదో వీడియో బైట్ ఇస్తున్నాడేమో అనుకునేరు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా సల్మాన్ తో ఓ యాడ్ కూడా షూట్ చేశారు. తాజాగా ఆ యాడ్ ని రిలీజ్ చేశారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలోని గ్రూట్ క్యారెక్టర్ లాగా సల్మాన్ కూడా కామెడీ చేస్తున్నట్టు ఈ యాడ్ ని డిజైన్ చేశారు. ప్రస్తుతం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా కోసం సల్మాన్ చేసిన ఈ యాడ్ వైరల్ గా మారింది.

ఇండియాలోని మార్వెల్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సల్మాన్ యాడ్ తో ఇండియాలో ఈ సినిమా భారీ మార్కెట్ మీద కన్నేసింది. మార్వెల్ స్టూడియోస్ “గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3” మే 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషలలో రిలీజ్ కాబోతుంది. మరి గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఇండియాలో ఏ రేంజ్ లో కలెక్షన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Marvel India (@marvel_india)