‘దబాంగ్ 3’ లో చిరు వీణ స్టెప్ వేసిన చుల్‌బుల్ పాండే

‘‘దబాంగ్ 3’’ లో సల్మాన్ ఖాన్ చేత కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా మెగాస్టార్ చిరంజీవి ‘‘ఇంద్ర’’ సినిమాలోని వీణ స్టెప్ వేయించడం విశేషం..

  • Published By: sekhar ,Published On : November 28, 2019 / 07:24 AM IST
‘దబాంగ్ 3’ లో చిరు వీణ స్టెప్ వేసిన చుల్‌బుల్ పాండే

Updated On : November 28, 2019 / 7:24 AM IST

‘‘దబాంగ్ 3’’ లో సల్మాన్ ఖాన్ చేత కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా మెగాస్టార్ చిరంజీవి ‘‘ఇంద్ర’’ సినిమాలోని వీణ స్టెప్ వేయించడం విశేషం..

ఒక బాషలో హిట్ అయిన సినిమాను మరో బాషలో రీమేక్ చేయడం, డబ్ చేయడం చూశాం. అదే ఒకస్టార్ వేసిన సూపర్ డూపర్ స్టెప్‌ని మరో స్టార్ హీరో వేస్తే ఎలా ఉంటది.. థియేటర్లో విజిల్స్ పడాల్సిందే కదా మరి.. మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో ‘‘దాయి దాయి దామ్మా’’ పాటలో వేసిన వీణ స్టెప్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య వీణ స్టెప్ వేసి అభిమానులను అలరించాడు.

Tribute to Chiranjeevi's 'Veena' step, Salman-Prabhudheva dance-off Here's what to expect from 'Munna Badnaam Hua'!

ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వీణ స్టెప్ వేయనున్నాడని బాలీవుడ్ టాక్. ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’ సినిమాల తర్వాత.. ప్రభుదేవా దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న సినిమా ‘దబాంగ్ 3’.. సల్మాన్ చుల్‌బుల్ రాబిన్‌హుడ్ పాండేగా ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలోని ఓ పాటలో ప్రభుదేవా, సల్మాన్ చేత వీణ స్టెప్ వేయించాడట.. సల్లూ భాయ్ కూడా ఎంతో ముచ్చటపడి వీణ స్టెప్ వేశాడని చెప్తున్నారు.

Image

ఇది మెగాస్టార్ చిరంజీవికి  ట్రిబ్యూట్‌గా భావిస్తున్నారట ‘దబాంగ్ 3’ మేకర్స్. సల్మాన్ వీణ స్టెప్ ఎలా వేశాడో తెలియాలంటే వచ్చే నెల 20 వరకు ఆగాల్సిందే. మ్యూజిక్ : సాజిద్ వాజిద్, సినిమాటోగ్రఫీ : మహేష్ లిమాయే, ఎడిటింగ్ : రితేష్ సోనీ, స్టోరీ : సల్మాన్ ఖాన్, స్క్రీన్‌ప్లే : సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, దిలీప్ శుక్లా, అలోక్ ఉపాధ్యాయ, యాక్షన్ : అనల్ అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జితేంద్ర చతుర్వేది.
Image