Tiger Ka Message : టైగర్ 3 టీజర్ వచ్చేసింది.. బతికున్నంతవరకు టైగర్ ఓటమిని ఒప్పుకోడు..

తాజాగా టైగర్ 3 సినిమా నుంచి టైగర్ కా మెసేజ్ అనే పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు.

Tiger Ka Message : టైగర్ 3 టీజర్ వచ్చేసింది.. బతికున్నంతవరకు టైగర్ ఓటమిని ఒప్పుకోడు..

Salman Khan Tiger Ka Message Tiger 3 Teaser Released

Updated On : September 27, 2023 / 11:54 AM IST

Tiger Ka Message : పఠాన్(Pathan) లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న స్పై మూవీ సల్మాన్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. టైగర్ 3(Tiger 3). YRF స్పై యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా ఉండబోతుంది. సల్మాన్ టైగర్ 3 పై భారీ అంచనాలు ఉన్నాయి. మనీష్ శర్మ దర్శకతవంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా టైగర్ 3 సినిమా నుంచి టైగర్ కా మెసేజ్ అనే పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ ఒక సీక్రెట్ రా ఏజెంట్ అని, కాని అతను ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ప్రచారం జరగడంతో సల్మాన్ తన కొడుకు కోసం, తన నిజాయితీ కోసం, తన దేశం కోసం ఎలా పోరాటం చేసాడన్నది కథగా ఉండనున్నట్టు చూపించారు. ఇక టీజర్ లోనే ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు చూపించారు. దీంతో సినిమాలో వార్, పఠాన్ సినిమాలకు మించి యాక్షన్ సీన్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది.

Also Read : VD13 Movie : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. VD13 ఫిక్స్.. టైటిల్ అనౌన్స్ త్వరలో..

ఇక టైగర్ 3 సినిమాని ఈ దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుఖ్ రెండు 1000 కోట్ల సినిమాలు సాధించడంతో ఈ సినిమా కూడా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని దిగుతుంది. ఇక YRF స్పై యూనివర్స్ లోని షారుఖ్ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు టైగర్ 3 సినిమాలో కూడా షారుఖ్ గెస్ట్ అప్పిరెస్ ఇవ్వనున్నాడని సమాచారం. దీంతో సల్మాన్ అభిమానులే కాక బాలీవుడ్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంది.