Samantha : నెటిజన్లతో సమంత చిట్ చాట్.. సమంత ఫోన్ వాల్ పేపర్ ఏంటి? ఫేవరేట్ కాఫీ? సమంతకు ఇది వరస్ట్ ఇయర్..?
చాలా రోజుల తర్వాత సమంత నెటిజన్లతో ముచ్చటించింది. నేడు ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పింది. దీంతో పలువురు నెటిజన్లు తమ ప్రశ్నలు అడగగా సమంత సమాధానాలిచ్చింది.

Samantha Chit Chat with Fans in Instagram Samantha Phone Wall Paper Samantha Favorite Coffee
Samantha Chit Chat : సమంత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం భూటాన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన సమంత తన బిజినెస్ లు, ఫౌండేషన్స్ పనులు చూసుకుంటుంది. త్వరలో క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది.
తాజాగా చాలా రోజుల తర్వాత సమంత నెటిజన్లతో ముచ్చటించింది. నేడు ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పింది. దీంతో పలువురు నెటిజన్లు తమ ప్రశ్నలు అడగగా సమంత సమాధానాలిచ్చింది.
వచ్చే సంవత్సరం మీరు కోరుకునే ఒక విషయం చెప్పండి అని అడగగా.. మంచి ఆరోగ్యం ఉండాలని సమంత సమాధానమిచ్చింది.
ఓ నెటిజన్ మీ ఫోన్ వాల్ పేపర్ ఏంటి అని అడగగా సామ్ తన ఫోన్ వాల్ పేపర్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. ఈ ఫొటోలో లింగ భైరవి అమ్మవారు ఉన్నారు. కోయంబత్తూరు ఇషా ఫౌండేషన్ లో ఉండే లింగ భైరవి అమ్మవారి ఫోటోని సమంత తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకుంది. గతంలో సమంత అక్కడికి వెళ్లి పూజలు చేసిన సంగతి తెలిసిందే.
మరో నెటిజన్ మీరు ఎక్కువగా ఆర్డర్ చేసే కాఫీ ఏంటి అని అడగగా.. ‘అమెరికానో’ అని సమాధానమిచ్చింది.
ఇక మరో నెటిజన్ ది వరస్ట్ ఇయర్ ఎండింగ్ అని పెట్టగా.. సమంత కూడా నేను అదే ఫీల్ అవుతున్నాను అని రిప్లై ఇచ్చింది. దీంతో సమంతకి ఈ ఇయర్ అంత బ్యాడ్ గా ఉందా అని అనుకుంటున్నారు. ఇలా సమంత నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో ఇవి వైరల్ గా మారాయి.