ఆ షో కోసం సమంత ప్రత్యేక డ్రెస్, ధర ఎంతో తెలుసా

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 04:05 PM IST
ఆ షో కోసం సమంత ప్రత్యేక డ్రెస్, ధర ఎంతో తెలుసా

Updated On : November 7, 2020 / 4:15 PM IST

Samantha new Dress Aha Program : టాలీవుడ్ నటి సమంత…నటిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ…అభిమాలను సంపాదించుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత డ్రెస్ అందర్నీ అట్రాక్ట్ చేసింది. ఈ డ్రెస్ సమంత అందాన్ని మరింత పెంచిందని చెప్పవచ్చు. ఆమే వేసుకున్న డ్రెస్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



అంటే..ఆ డ్రెస్ ప్రత్యేకత ఏంటో అర్థమౌతుంది. సినీ నటిగా ఉన్న ఈమె..కొత్త రూట్ ఎంచుకున్నారు. ప్రముఖ OTT Ahaలో సామ్ జామ్ పేరిట టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక డ్రెస్ వేసుకుని తళుక్కున మెరిశారు.



ఈ డ్రెస్ పై తెగ చర్చించుకున్నారు. ఎక్కడిది ఈ డ్రెస్ అంటూ నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. పంకజ్ అండ్ నిధి టేబుల్ పై తయారు చేసిన కాన్వా ఫ్లూయిడ్ మాక్సీ డ్రెస్ ధర ఆన్ లైన్ లో రూ. 27 వేలుగా ఉంది. దీనికి ఒక ప్రత్యేకత ఉందంట. ప్లాస్టిక్ ను రీ సైకిల్ చేయడం ద్వారా రూపొందించిన ప్రత్యేక వస్త్రంతో దీనిని రూపొందించారట. ఇక డ్రెస్ పై ఆమె ధరించిన చెవిపోగులు, ఇయర్ టడ్స్ ప్రత్యేక అట్రాక్టివ్ గా నిలిచాయి.



సామ్ జామ్ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ..తనకు ఇది ప్రత్యేక ప్రయాణమని, ఈ టాక్ షో చేశాక..నటన చాలా సులువనిపించిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు, కొత్త ప్రతిభను ప్రోత్సాహించడంతో పాటు సామాజిక సమస్యలను ఎత్తి చూపించబోతున్నట్లు సమంత వెల్లడించింది.