Samantha : అందుకే అక్కినేని తీసేసిందా..?
సమంత తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో సమంత అక్కినేని అనే పేరుకి బదులు కేవలం ‘ఎస్’ అక్షరాన్ని మాత్రమే పెట్టింది..

Samantha
Samantha: అక్కినేని కోడలు పిల్ల సమంత ఏం చేసినా సెన్సేషనే.. స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు చైతుతో ప్రేమలో పడడం, పెళ్లి తర్వాత తన పేరుకి ముందు అక్కినేని ఇంటి పేరుని యాడ్ చెయ్యడం, ఆఫ్టర్ మ్యారేజే హీరోయిన్‌గా కెరీర్ డల్ అవుతుందిలే అనుకుంటే.. లేడీ ఓరియంటెడ్, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, తర్వాత ‘ది ఫ్యామిలీ మెన్ – 2’ తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టెయ్యడం, సినిమాలతో పాటు ప్రీ స్కూల్, ఫ్యాషన్ ఫీల్డ్‌లో ఎంట్రీ ఇవ్వడం.. ఇలా సామ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది.
Most Desirable Women 2020 : టాప్ ప్లేస్‌లో సమంత అక్కినేని..
ఇప్పుడు మరో సస్పెన్స్‌తో కూడిన సెన్సేషన్ క్రియేట్ చేసింది సమంత. తనపేరు ముందు అక్కినేని ఇంటిపేరుని రిమూవ్ చేసేసింది. సమంత తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో సమంత అక్కినేని అనే పేరుకి బదులు కేవలం ‘ఎస్’ అక్షరాన్ని మాత్రమే పెట్టడంతో అసలేం జరిగింది అంటూ అక్కినేని ఫ్యాన్స్, నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
ఏదైనా ప్రమోషన్‌లో భాగంగా నేమ్ ఎడిట్ చేసిందా, లేదా ఇంకేదైనా రీజన్ ఉందా..? ఏదోటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha : సమంతను ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏమని పిలుస్తారో తెలుసా..!
కట్ చేస్తే.. సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్‌లో ‘శాకుంతలం’ అనే హిస్టారికల్ మూవీలో టైటిల్ రోల్ చేస్తోంది. సమంతలో ఫస్ట్ లెటర్ ‘S’, ‘శాకుంతలం’ లోనూ మొదటి అక్షరం ‘S’ కాబట్టి, ఈమధ్య ఆర్టిస్టులు తాము చేస్తున్న సినిమాల పేర్లని ఐడీలుగా పెట్టుకుంటున్నారు కాబట్టి సమంత కూడా అలా పేరు ఎడిట్ చేసుంటుంది అనే మాట కూడా వినబడుతోంది.
Wishing our ‘Kavya Nayaki’ @Samanthaprabhu2 garu a very Happy Birthday. #Shaakuntalam ?#HBDSamanthaAkkineni pic.twitter.com/N3ykrOcKdJ
— Gunaa Teamworks (@GunaaTeamworks) April 28, 2021