Samantha : మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు.. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై సమంత వ్యాఖ్యలు..

శాకుంతలం సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వడంతో ముంబైలో కూడా సమంత భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా వరుసగా బాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది సమంత. వీటిల్లో అనేక ఆసక్తికర విషయాలని తెలిపింది.....................

Samantha : మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు.. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై సమంత వ్యాఖ్యలు..

Samantha sensational comments on Heroins Remunerations

Updated On : March 29, 2023 / 6:02 PM IST

Samantha :  మయోసైటిస్ నుంచి కోలుకొని ఇటీవల వర్క్ లోకి కంబ్యాక్ ఇచ్చింది సమంత(Samantha). ప్రస్తుతం సమంత ఓ పక్క సినిమా షూటింగ్స్ తో మరో పక్క సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తెలుగులో విజయ్(Vijay Devarakonda) సరసన ఖుషి(Kushi) సినిమా షూటింగ్, హిందీలో వరుణ్ ధావన్(Varun Dhavan)తో సిటాడెల్(Citadel) సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం(Shakunthalam) సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా(Pan India) వైడ్ రిలీజ్ కానుంది.

మన పురాణాల్లోని దుశ్యంతుడు – శకుంతల కథ ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శాకుంతలం సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వడంతో ముంబైలో కూడా సమంత భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా వరుసగా బాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది సమంత. వీటిల్లో అనేక ఆసక్తికర విషయాలని తెలిపింది.

Priyanka Chopra : RRR తమిళ సినిమా అంటూ ప్రియాంక చోప్రా కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న తెలుగు నెటిజన్లు..

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. మా శ్రమ, ట్యాలెంట్ చూసి ఇంత రెమ్యునరేషన్ ఇస్తామని నిర్మాతలే చెప్పాలి. నేను నాకింత రెమ్యునరేషన్ ఇవ్వాలి అని అడగను. అలా అడుక్కోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. హీరోయిన్స్ కి నిర్మాతలే రెమ్యునరేషన్ వాళ్లకు తగినంత ఇవ్వాలి. దానికి తగ్గట్టు మేము కష్టపడతాము. మా దగ్గర ట్యాలెంట్ ఉండి, కష్టపడితే రెమ్యునరేషన్స్ వాళ్ళే ఇస్తారు, ఇవ్వాలి అని తెలిపింది. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.