Samantha : బాలిలో సమంత బుల్లి నిక్కరు డాన్స్ అదుర్స్.. 100 శాతం ఎంజాయ్ చేశానంటున్న వీడియో వైరల్..

ప్రస్తుతం బాలిలో హాలిడే ట్రిప్ లో ఉన్న సమంత.. బుల్లి నిక్కరిలో తన స్నేహితురాలితో కలిసి వేసిన స్టెప్పులు అదరహో అనిపించేలా ఉన్నాయి. ఆ వీడియో చూశారా..?

Samantha : బాలిలో సమంత బుల్లి నిక్కరు డాన్స్ అదుర్స్.. 100 శాతం ఎంజాయ్ చేశానంటున్న వీడియో వైరల్..

Samantha share dance video from her holiday gone viral

Samantha : స్టార్ హీరోయిన్ సమంత తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసేసి.. ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే ఈ భామ ఇండోనేషియాలోని బాలికి తన స్నేహితురాలితో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ పలు దేవాలయాలని, ప్రకృతి ప్రదేశాలని సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే నిన్న జులై 27న కోతిని ఒళ్ళో కుర్చోబెట్టుకొని సెల్ఫీ దిగిన పిక్ ని షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

Bro Movie : తండ్రి మూవీ చూసిన అకీరా.. అదిరిపోయే కారులో.. స్టైలిష్ లుక్స్‌లో హీరోలా ఎంట్రీ.. వీడియో చూశారా..?

తాజాగా ఒక డాన్స్ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో బుల్లి నిక్కరిలో తన స్నేహితురాలితో కలిసి సమంత వేసిన స్టెప్పులు అదరహో అనిపించేలా ఉన్నాయి. ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. లైక్స్ అండ్ షేర్స్ కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోస్ట్ సమంత ఇలా రాసుకొచ్చింది.. “గర్ల్స్ ట్రిప్ వందకి వంద శాతం ఎంజాయ్ చేశాను” అంటూ క్యాప్షన్ పెట్టింది. మరి ఎంజాయ్‌మెంట్ లో సామ్ వేసిన స్టెప్పులు ఒకసారి మీరు కూడా చూసేయండి.

Prabhas : ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్.. ప్రభాస్ పేజీలో వేరే పోస్టులు..

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

కాగా హాలిడే మొదలైన దగ్గర నుంచి సామ్ పోస్ట్ చేస్తున్న పోస్టులు చూస్తుంటే.. ఇది హాలిడే ట్రిప్ మాత్రమే కాదు, శారీరకంగా మరియు మానసికంగా బలంగా అవ్వడానికి సహజసిద్ధమైన చికిత్సలను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉదయం వ్యాయామాలు, యోగాలు, నేచురల్ థెరపీలు తీసుకుంటూ ప్రకృతి మధ్య గడుపుతూ.. మెంటల్ అండ్ ఫిజికల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు సమంత షూటింగ్స్ ఒక ఏడాది పాటు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.