Bro Movie : తండ్రి మూవీ చూసిన అకీరా.. అదిరిపోయే కారులో.. స్టైలిష్ లుక్స్‌లో హీరోలా ఎంట్రీ.. వీడియో చూశారా..?

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా చూసేందుకు జూనియర్ పవర్ స్టార్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు..

Bro Movie : తండ్రి మూవీ చూసిన అకీరా.. అదిరిపోయే కారులో.. స్టైలిష్ లుక్స్‌లో హీరోలా ఎంట్రీ.. వీడియో చూశారా..?

Akira Nandan watch Pawan Kalyan Sai Dharam Tej Bro movie with fans

Updated On : July 28, 2023 / 3:51 PM IST

Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ ‘బ్రో’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మొదటి షోతోనే సక్సెస్ టాక్ ని సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తుంది. మూవీలో చాలా ఏళ్ళ తరువాత వింటేజ్ పవన్ యాక్షన్ కనిపించడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వింటేజ్ పవన్ ని అందరితో కలిసి థియేటర్ లో ఎంజాయ్ చేయడానికి పవన్ తనయుడు ‘అకీరా నందన్’ హైదరాబాద్ సుదర్శన్‌ థియేటర్‌కు చేరుకున్నాడు.

NTR : RRRలో నాకు నచ్చిన యాక్టర్ ఎన్టీఆర్.. జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి..!

ఇక ఈ థియేటర్ కి అకీరా ఇచ్చిన ఎంట్రీ మాములుగా లేదు. బ్రో మూవీ ప్రింట్ తో ఉన్న టి షర్ట్ వేసుకొని స్టైలిష్ లుక్స్‌లో అదిరిపోయే కారులో హీరోలా ఎంట్రీ ఇచ్చి అదరహో అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను పవన్ అభిమానులు.. జూనియర్ పవర్ స్టార్ అంటూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలు చూసిన కొంతమంది అభిమానులు అకీరా ఎంట్రీ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అకీరా ఎంట్రీ బాధ్యతలను రామ్ చరణ్ (Ram Charan) తీసుకున్నాడని సమాచారం. చరణ్ నిర్మాణంలోనే అకీరా డెబ్యూ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.

Bro Movie : ఒరిజినల్ ‘వినోదయసీతం’.. ‘బ్రో’ సినిమాకు తేడాలు ఇవే.. 5 కోట్ల బడ్జెట్ వర్సెస్ 75 కోట్ల బడ్జెట్..

కాగా బ్రో మూవీ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అలరించేలా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని, ప్రస్తుత మెకానికల్ లైఫ్ లో పది హ్యూమన్ రిలేషన్స్ ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామో అనే విషయాన్ని ఎమోషనల్ గా చూపించారని ఆడియన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం థియేటర్స్ వద్ద పవర్ సునామీ కనిపిస్తుంది.