Subham : సమంత నిర్మాతగా మొదటి సినిమా.. శుభం మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘శుభం’.

Samantha Subham movie three days collections details here
ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
కాగా.. ఈ చిత్రాన్ని 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఇప్పటికే ఈ చిత్రం లాభాల బాట పట్టింది. ఇక ఓటీటీ హక్కులను జీ మంచి మొత్తానికే సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. దీంతో నిర్మాతగా సమంత తొలి చిత్రంతోనే భారీగానే లాభాలు అందుకున్నట్లే.