Martin Luther King Teaser : సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ టీజర్ రిలీజ్.. ఒక్క ఓటు కోసం సంపూని..
ఈసారి ఓ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు సంపూర్ణేష్ బాబు. తమిళ్ లో యోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మండేలా సినిమాకి రీమేక్ గా ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) అనే సినిమాతో రాబోతున్నాడు సంపూర్ణేష్ బాబు.

Sampoornesh Babu next Movie Martin Luther King Teaser Released
Martin Luther King Teaser : సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) టాక్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈసారి ఓ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు సంపూర్ణేష్ బాబు. తమిళ్ లో యోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మండేలా సినిమాకి రీమేక్ గా ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) అనే సినిమాతో రాబోతున్నాడు సంపూర్ణేష్ బాబు.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజయింది. టీజర్ లో.. ఒక ఊర్లో ప్రసిడెంట్ పోటీ కోసం రెండు వర్గాలు పోటీ పడగా ఒక్క ఓటు తక్కువవుతుంది గెలవడానికి. ఆ ఒక్క ఓటు సంపూర్ణేష్ బాబు అవ్వడంతో అతన్ని ఆకట్టుకోవడానికి ఇరువర్గాలు ఏం చేశాయి, అతనికి ఏం ఇచ్చాయి అనే కథగా చూపించారు. దీంతో ఈ సినిమా పొలిటికల్ కామెడీ డ్రామాలా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Kangana Ranaut : దసరా బరిలో కంగనా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో దూసుకొస్తున్న ‘తేజస్’.. టీజర్ రిలీజ్..
దీనిని పూర్తి రీమేక్ చిత్రంగా కాకుండా మెయిన్ పాయింట్ ని మాత్రం తీసుకోని పూజా కొల్లూరు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో నరేష్, డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్రలు చేస్తున్నారు. దసరా తర్వాత అక్టోబర్ 27న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. తమిళ్ లో భారీ హిట్ కొట్టి పలు అవార్డులు సాధించిన మండేలా సినిమా రీమేక్ ఇక్కడ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.