Samuthirakani : తెలుగుతో పాటు 12 భాషల్లో బ్రో సినిమా రీమేక్.. సాయిధరమ్‌తో సముద్రఖని మరో మూవీ..
తెలుగుతో పాటు బ్రో సినిమాని మొత్తం 12 భాషల్లో రీమేక్ చేయనున్న సముద్రఖని. అలాగే సాయిధరమ్‌తో మరో మూవీ..

Samuthirakani remake bro into 12 languages and another movie with Sai Dharam Tej
Samuthirakani – Sai Dharam Tej : తమిళ్ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని.. కోలీవుడ్ అండ్ టాలీవుడ్ లో పలు సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అండ్ సాయి ధరమ్ తేజ్ తో బ్రో (Bro) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ దర్శకుడు తమిళంలో నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘వినోదయ సిత్తం’కి బ్రో రీమేక్ గా వస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సముద్రఖని పలు ఆసక్తికర విషయాలని ఆడియన్స్ తో పంచుకున్నాడు.
Project K launch : ప్రాజెక్ట్ K లాంఛ్ ఈవెంట్‌కు వెళ్లని దీపికా పదుకొనే.. అసలు కారణం ఇదే..!
ఈ క్రమంలోనే ఈ బ్రో రీమేక్ తో పాటు ‘వినోదయ సిత్తం’ని మొత్తం 12 భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే బాలీవుడ్ లో ఈ సినిమాని రీమేక్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ రీమేక్ లో ఎవరు నటించబోతున్నారు అనేది తెలియజేయలేదు. హిందీ తరువాత భోజ్‌పూరి, ఒరియా భాషల్లో ఈ మూవీ రీమేక్ కానున్నట్లు పేర్కొన్నాడు. ఈ రీమేక్స్ తో పాటు సాయి ధరమ్ తేజ్ తో మరో మూవీని కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ మూవీ కూడా బ్రో మాదిరి డిఫరెంట్ జోనర్ లో ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sai Dharam Tej : విరూపాక్షతో పెళ్లి పై హోప్ వచ్చింది.. కానీ Bro తో అది పూర్తిగా పోయింది..
ఇక బ్రో విషయానికి వస్తే.. ఈ నెల 28న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ అదనపు షోలు వేయడం, టికెట్ రేట్స్ పెంచడం వంటివి ఏమి లేవని నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ తెలియజేశాడు. అలాగే ఈ నెల 25న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దాదాపు అటెండ్ అవ్వవచ్చు అని తెలియజేశారు.