Samuthirakani: క్రేజీ విలన్.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. సముద్రఖని రెండు పడవల ప్రయాణం!

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్స్ ఎక్కువ, స్టార్సే తక్కువ.. ఇప్పుడలా కాదు, స్టార్స్ ఎక్కువై విలన్సే తక్కువైపోయారు.. అందుకే ప్రతినాయకుల పాత్రల కోసం పరభాషా నటుల మీద ఆధార పడక తప్పడం లేదు ఇక్కడి ఫిలిం మేకర్స్ కు.

Samuthirakani: క్రేజీ విలన్.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. సముద్రఖని రెండు పడవల ప్రయాణం!

Samuthirakani

Updated On : May 14, 2022 / 7:24 PM IST

Samuthirakani: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్స్ ఎక్కువ, స్టార్సే తక్కువ.. ఇప్పుడలా కాదు, స్టార్స్ ఎక్కువై విలన్సే తక్కువైపోయారు.. అందుకే ప్రతినాయకుల పాత్రల కోసం పరభాషా నటుల మీద ఆధార పడక తప్పడం లేదు ఇక్కడి ఫిలిం మేకర్స్ కు. వాళ్లలో కూడా ఒక్కో టర్మ్ లో ఒక్కో విలన్ హాట్ విలన్ అవుతున్నారు.. లేటెస్ట్ గా సముద్రఖని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ విలన్. ఆయన కేవలం నటుడే కాదు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కూడా.. అయితే, తెలుగులోనూ తను రెండు పడవల ప్రయాణం చేయబోతున్నారా అనిపిస్తుంది.

Samuthirakani : సముద్రఖని బర్త్‌డే స్పెషల్.. ‘పంచతంత్రం’లో రామనాథం ఫస్ట్‌లుక్ రిలీజ్..

ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలకు ధీటైన విలన్ గా ఆడియన్స్ ను హడలెత్తిస్తున్న పరభాష నటుడు సముద్ర ఖని. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఇలా స్టార్ ఎవరైతేనేం.. విలన్ మాత్రం ఒక్కరే అన్నట్టు ఉంది పరిస్థితి. ఆయనకిచ్చిన క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే పరకాయ ప్రవేశం చేస్తూ పెర్ఫామెన్స్ ఇరగదీస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ధీటుగా, రానాకు ఫాదర్ గా భీమ్లా నాయక్ సినిమాలో పొలిటిషన్ క్యారెక్టర్ లో మెప్పించారు. పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానించే సముద్రఖని, తమిళ సూపర్ హిట్ మూవీ వినోదాయ సీతం సినిమాను, పవన్ కళ్యాణ్ తోనే తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

Vinodhaya Sitham: మేనల్లుడితో పవన్.. స్వీయ నిర్మాణంలో రీమేక్?

సముద్రఖని నటుడు, దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా.. తమిళ్‌లో ఆయన రచనా డైరెక్షన్‌లోనే వచ్చిన.. వినోదాయసితం సినిమా సూపర్ హిట్‌ అయింది. దాన్నే.. తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ కల్యాణ్‌ని ఒప్పించారు. ఇదే ఊపులో సముద్రఖని మరో కథ కూడా రెడీ చేసుకుని, దానినే చరణ్‌కి వినిపించాడని ఆమధ్య టాక్ వినిపించింది. ఆ కథ కొత్తగా ఉండటంతో రాంచరణ్ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారని సమాచారం. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సముద్ర ఖని, ట్రిపుల్ ఆర్ లో కొమురం భీమ్ సన్నిహితుడిగా తన పరిధి మేరకు అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు సముద్ర ఖని.

Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..

ఇక సర్కార్ వారి పాటలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు యాంటాగనెస్ట్ గా, హీరోయిన్ ఫాదర్గా పవర్ ఫుల్ విలనిజాన్ని పలికించారు సముద్రఖని. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠ పురం విలన్ గా సముద్రఖని క్యారెక్టర్ బాగా వర్కవుట్ అయ్యింది. దాంతో తెలుగు స్టార్ హీరోలంతా సముద్రఖని పై దృష్ఠి పెట్టారు… మాస్ రాజ రవితేజ సినిమాలో కటారి కృష్ణగా చేసి, తన క్యారెక్టర్ కే స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేశారు… దాంతో ఇప్పుడు ఏ స్టార్ హీరో సినిమాలో అయినా సరే సముద్ర ఖని ఉండాల్సిందే అన్నట్టు తయారైంది టాలీవుడ్ ఇండస్ట్రీ.

Pawan Kalyan: వీరమల్లు లాక్ చేశాడా.. పండగ పట్టుకొస్తానంటోన్న పవన్..?

ఇలా నటనలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, స్టార్ డైరెక్టర్ గా తెలుగు లోనూ తన సత్తా చాటాలని చూస్తున్నాడు సముద్రఖని. మరి సముద్రఖని అటు నటుడిగా, ఇటు డైరెక్టర్ గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో పవన్ కళ్యాణ్ తో ఆయన చేయబోయే సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం… అంటున్నారు సినీ అభిమానులు.