Thalaivar 171 : రజినీకాంత్ సినిమా అప్డేట్‌ని లీక్ చేసిన సందీప్ వంగ.. లోకేష్ కనగరాజ్ అదరగొట్టేశాడట..
రజినీకాంత్ 171వ సినిమా అప్డేట్‌ని లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగ. అదేంటంటే..

Sandeep Reddy Vanga leaks Rajinikanth Thalaivar 171 movie update
Thalaivar 171 : కోలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజిస్ట్ ప్రాజెక్ట్ తలైవర్ 171. రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ పై తమిళ్ ఆడియన్స్ లో మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి రజిని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కి వింటేజ్ రజినీకాంత్ ని గుర్తు చేశారు.
దీంతో ఈ సినిమా పై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ మూవీ టైటిల్ ని ఏప్రిల్ 22న ప్రకటిస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే కాదట, టీజర్ కూడా రాబోతుందట. ఈ విషయాన్ని టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లీక్ చేశారు. రీసెంట్ గా ఈ డైరెక్టర్ ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Also read : Spirit : ప్రభాస్ హాలీవుడ్ మూవీని రీమేక్ చేద్దాం అన్నారు.. కానీ నేను స్పిరిట్ మూవీని.. సందీప్ వంగ
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నాకు విక్రమ్ సినిమా బాగా నచ్చింది. ఇటీవల లోకేష్ కనగరాజ్ ని కూడా కలుసుకున్నాను. ఆ సమయంలో రజినీకాంత్ కొత్త సినిమా టీజర్ ని చూసాను. ఆ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తో టీజర్ కూడా రిలీజ్ అవుతుందని తెలియజేయడమే కాకుండా, ఆడియన్స్ లో టీజర్ పై హైప్ ని కూడా క్రియేట్ చేశారు. మరి సందీప్ కి నచ్చిన ఆ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
I watched #Thalaivar171 teaser and I cant wait to watch the film- Sandeep Reddy Vanga ? #Vettaiyan pic.twitter.com/ZOZ4bkrvaZ
— Abhishek (@funkyboss96) April 8, 2024
ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలో రజిని పాత్రతో సమానంగా ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉంటుందట. ఇక ఆ పాత్ర కోసం లోకేష్ కనగరాజ్.. షారుఖ్ ఖాన్ ని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ ఆఫర్ ని షారుఖ్ చాలా సున్నితంగా తిరస్కరించారని, దీంతో ఆ ఆఫర్ ని రణ్‌వీర్ సింగ్ దగ్గరకి తీసుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియదు.