Prabhas – Allu Arjun : ప్రభాస్‌తో సినిమా అయిన తరువాతే అల్లు అర్జున్‌ మూవీ.. నిర్మాత క్లారిటీ..

ప్రభాస్, అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాల గురించి బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఒక క్లారిటీ ఇచ్చాడు.

Prabhas – Allu Arjun : ప్రభాస్‌తో సినిమా అయిన తరువాతే అల్లు అర్జున్‌ మూవీ.. నిర్మాత క్లారిటీ..

Sandeep Reddy Vanga movie Allu Arjun after Prabhas Spirit

Updated On : September 12, 2023 / 11:17 AM IST

Prabhas – Allu Arjun : పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ అండ్ అల్లు అర్జున్.. తమ తమ లైనప్స్ లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ని సెట్ చేసుకొని పెట్టుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్ (Salaar), కల్కి (Kalki 2898 AD), మారుతీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) మూవీలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఇద్దరి తరువాత లైనప్ లో ఉన్న కామన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ అండ్ బన్నీతో సందీప్ వంగ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను బాలీవుడ్ బడా కంపెనీ టి-సిరీస్ నిర్మిస్తుంది.

Samyuktha Menon : సంయుక్త మీనన్ బర్త్ డే స్పెషల్.. మూవీ అప్డేట్స్ అదిరిపోయాయి..

కాగా ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు మొదలవుతుంది అనే దాని పై అభిమానుల్లో కొంత సందేహం నెలకుంది. తాజాగా దీని గురించి నిర్మాత భూషణ్ కుమార్ ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఒక క్లారిటీ ఇచ్చాడు. “ముందుగా ప్రభాస్ స్పిరిట్ (Spirit) సినిమాని మొదలుపెడతాం. అది మొత్తం కంప్లీట్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చిన తరువాతే అల్లు అర్జున్ మూవీని స్టార్ట్ చేస్తాం” అంటూ వెల్లడించాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ వంగ.. రణబీర్ తో తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ పూర్తి అయ్యిపోయి రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

SJ Suryah : మహేష్ బాబుకి నేను బాకీ ఉన్నా.. ఎప్పటికైనా ఆ బాకీ తీర్చేస్తా..

మరి ప్రభాస్ తో ‘స్పిరిట్’ని ఈ ఏడాదే స్టార్ట్ చేస్తారా..? లేదా..? అనేది చూడాలి. కాగా అల్లు అర్జున్ చేతిలో సందీప్ వంగ అండ్ త్రివిక్రమ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సందీప్ వంగ సినిమా లేటు అవుతుందని తెలిసింది కాబట్టి.. ముందుగా త్రివిక్రమ్ మూవీ పట్టాలు ఎక్కనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడు చిత్రాలు రాగా.. మూడు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఈసారి వచ్చే మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని ఇటీవల అల్లు అర్జున్ మీడియాకి తెలియజేశాడు.