వైరల్ : పీపీఈ సూట్లలో సెలూన్ ఉద్యోగులతో నటి బర్త్‌డే సెలబ్రేషన్స్

  • Published By: Chandu 10tv ,Published On : July 10, 2020 / 02:22 PM IST
వైరల్ : పీపీఈ సూట్లలో సెలూన్ ఉద్యోగులతో నటి బర్త్‌డే సెలబ్రేషన్స్

Updated On : July 10, 2020 / 3:20 PM IST

బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీ తన 60 వ పుట్టిన రోజును సెలూన్ ఉద్యోగులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంధర్భంగా ఆమె ఒక సరికొత్త హెయిర్ స్టైల్‌ను ప్రదర్శిస్తూ కనిపించింది. సామాజిక దూరాన్ని పాటిస్తూ కేక్ కట్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

Actress #SangeetaBijlani Celebrates Her #Birrhday with #Media. . . . . #happybirthdaysangeetabijlani #spotting #bollywood #trend #latest #instagood #igers

A post shared by Bollywood Helpline (@bollywoodhelpline) on

ఆ వీడియోలో సెలూన్ ఉద్యోగులు పిపిఈ కిట్స్ ను ధరించారు. వారందరూ కలిసి పుట్టిన రోజు పాటను పాడుతుండగా సంగీత కేక్ ను కట్ చేసింది. తన పుట్టిన రోజును వారందరితో కలిసి జరుపుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని, వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని సంగీత అన్నారు. అంతేకాకుండా తన తండ్రితో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు.


సంగీత బిజ్లానీ 1980 లో మిస్ ఇండియాగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశం తరపున పాల్గొన్నది. సంగీత 1987 లో కటిల్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తర్వాత త్రిదేవ్, హత్యార్, జుర్మ్, యోధ, యుంగధర్, ఇజ్జత్, లక్ష్మణ రేఖ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించింది.