Sanjay dutt : సంజయ్ దత్‌కు అరుదైన గౌరవం.. ఆఫ్రికా దేశం జాంజిబార్ కి టూరిజం అంబాసిడర్ గా ఎంపిక
ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో భాగమైన జాంజిబార్ ఐల్యాండ్ కి పర్యాటక అంబాసిడర్ గా ఆ దేశ ప్రభుత్వం సంజయ్ దత్ ని ప్రకటించారు. ఆ ఐల్యాండ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశానికి బ్ర

Sanjay
Sanjay dutt : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటుడిగా ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో అవార్డులు సాధించారు. ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు. కాని పర్సనల్ లైఫ్‌లో మాత్రం అనేక వివాదాలలో నిలిచి జైలుకి కూడా వెళ్లొచ్చారు. అయినా సినిమాలల్లో నటిస్తూ ఆయన అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎన్ని వివాదాల్లో ఉన్నా అయన అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. తాజాగా సంజయ్ దత్ కు ఓ అరుదైన గౌరవం లభించింది.
Janhvi Kapoor : జాన్వీ కపూర్ బికినీ షో… దుబాయ్ టూర్లో ధడక్ స్టార్ దూకుడు.. Photos
ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో భాగమైన జాంజిబార్ ఐల్యాండ్ కి పర్యాటక అంబాసిడర్ గా ఆ దేశ ప్రభుత్వం సంజయ్ దత్ ని ప్రకటించారు. ఆ ఐల్యాండ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా సంజయ్ దత్ నియమించబడ్డారు. దీనికి సంబంధించి ట్వీట్ చేస్తూ.. జాంజిబార్ ప్రెసిడెంట్ ని ఉద్దేశించి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. జాంజిబార్‌లో పెట్టుబడులు ఆరోగ్యం & విద్యా రంగానికి సహకరించే అవకాశం లభించడంతోపాటు మీ ప్రభుత్వ సహకారంతో ఈ అందమైన ద్వీప నగరానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అంబాసిడర్ గా ఉన్నందుకు నాకు గౌరవంగా ఉంది అని సంజయ్ దత్ తెలిపారు.
Faria Abdullah : ‘ఢీ’ సీక్వెల్ లో చిట్టి
అలాగే సంజయ్ టాంజానియా ప్రధానమంత్రిని కలుసుకున్న ఫోటోలను షేర్ చేసి.. గౌరవనీయమైన ప్రధాన మంత్రిని కలవడం నిజంగా గౌరవం. టాంజానియా చలనచిత్ర పరిశ్రమకు మద్దతు ఇస్తున్నందుకు, మీ అందమైన దేశంలో పర్యాటక రంగంలో పెట్టుబడిని ప్రోత్సహించగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. త్వరలో మళ్లీ సందర్శిస్తానని ఆశిస్తున్నాను అని పోస్ట్ చేశారు.