సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో!

  • Published By: sekhar ,Published On : October 27, 2020 / 05:19 PM IST
సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో!

Updated On : October 27, 2020 / 5:26 PM IST

Saran Introducing as Hero: సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శరణ్ ‘ది లైట్’ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. మాన్విత, కుశల కుమార్ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలత బి. వెంకట్, వెంకట్ బులేమని నిర్మిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు సుధీర్ బాబు, నవీన్ విజయకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, వీకే నరేష్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న మా కుటుంబంలో సభ్యుడైన శరణ్ కి నా అభినందనలు. ఇంతకు ముందు మా కుటుంబం నుంచి వచ్చిన చాలామంది ఆర్టిస్టులను ప్రేక్షకులు ఆదరించారు. అభిమానించారు. అలాగే, శరణ్ ని కూడా ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకి, దర్శకులకి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.

నటి జయసుధ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, శరణ్ పెద్ద హీరో అవ్వాలని… అలాగే, రామచంద్ర కూడా పెద్ద దర్శకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

వీకే నరేష్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా దర్శకుడు రామచంద్ర నాకు బాగా పరిచయస్తుడు. సోదరుడి లాంటివాడు. తను మంచి రైటర్. శరణ్ నాకు అల్లుడు అవుతాడు. నా కజిన్ రాజు కుమారుడు. ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుతున్నాను. మేమంతా శరణ్ కి సపోర్ట్ గా ఉంటాం. కచ్చితంగా ఈ సినిమా బావుంటుంది’’ అన్నారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ ‘‘శరణ్… విషింగ్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రాండ్ లాంచ్. నువ్వు ఎన్నో సినిమాలు చేయాలనీ, చాలా విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. తొలి సినిమా ఎప్పుడూ స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీ నుండి మరొకరు హీరోగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. శరణ్ కి ఆల్ ది వెరీ బెస్ట్. హీరో కావాలని తను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

హీరో శరణ్ మాట్లాడుతూ ‘‘కృష్ణ, విజయనిర్మల గార్ల బ్లెస్సింగ్స్ తో హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను, చంద్రగారు ఏడాదిన్నరగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. కలిసి ట్రావెల్ చేస్తున్నాం. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న మా నిర్మాతలకి థ్యాంక్స్’’ అన్నారు.

రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ ‘‘ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో సూపర్ స్టార్ కృష్ణగారు ముందుంటారు. ఆయనతో పాటు గిన్నిస్ బుక్ హోల్డర్ విజయనిర్మల గారు నడయాడిన ఈ ప్రదేశంలో మా సినిమా ప్రారంభం కావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ప్రారంభోత్సవం అద్భుతంగా జరగడానికి వెర్సటైల్ యాక్టర్ డాక్టర్ వీకే నరేష్ గారు అందించిన సహకారం మరువలేనిది. నా కథ వినగానే మరో ఆలోచన లేకుండా వెంటనే చేద్దామని ప్రోత్సహించిన మా నిర్మాత వెంకట్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మా టీమ్ సహకారంతో ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించి, ఇండస్ట్రీలో నాకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటానని తెలియజేసుకుంటున్నా’’ అన్నారు. నిర్మాతలు శ్రీలత, వెంకట్ మాట్లాడుతూ ‘‘నవంబర్ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, జనవరిలోపు సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు.

ImageImageImage