Daksha : ఓటీటీలోకి వచ్చిన సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడి సినిమా..
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ దక్ష.

Daksha Movie
Daksha : సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ దక్ష. 2023 ఆగస్టు లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాణంలో వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు.
Also Read : Jr NTR : ఇంటిని రీ ఇన్నోవేషన్ చేయించిన ఎన్టీఆర్.. ఇంటీరియర్ టీమ్ తో ఫొటోలు..
దక్ష సినిమా నిన్న జులై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. థియేటర్‌లో మంచి స్పందన లభించినట్లుగానే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు దక్ష తప్పకుండా నచ్చుతుంది. పైరసీకీ దూరంగా ఉండి అధికారిక వేదికల ద్వారా మా సినిమాను వీక్షించండి. పైరసీకి పాల్పడిన కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే కంప్లయింట్ చేసాము అని తెలిపారు.