సరిలేరు నీకెవ్వరు: తొలిరోజు రికార్డు కలెక్షన్లు

‘సరిలేరు నీకెవ్వరు’.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ముందుగా ఊహించినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అని తొలిరోజే ప్రేక్షకులు తేల్చేశారు. చాలా కాలం తర్వాత మహేష్ కమర్షియల్ హీరోగా నటించగా.. సంక్రాంతి సెలవులు కావడంతో థియేటర్లలో సినిమాలకు
ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకొని తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది.
అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీతో కుటుంబ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ సినిమా మాస్ సెంటర్స్‌లో ఈ బొమ్మ రికార్డు కలెక్షన్లు రాబట్టింది తొలిరోజు. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ‘సరిలేరు నీకెవ్వరు’తో థియేటర్స్‌లో బొమ్మ దద్దరిల్లిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజే రూ. 35కోట్లను రాబట్టింది.
ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టి మహేష్ పట్టుబిగించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో ఈ సినిమా 1,27,09,211 రాబట్టి.. అక్కడ తొలిరోజు మహేష్ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్ రికార్డు సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 47 కోట్లు రాబట్టినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ముదులిపేసింది ఈ మూవీ. అమెరికాలో 294 సెంటర్లలో విడుదలైన ఈ సినిమా 759,973 డాలర్స్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.