Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌కు చేరిన సర్కారు షూటింగ్.. నెక్స్ట్ రచ్చ మహేష్‌దే!

ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది సర్కారు వారి పాట. ఎంత స్పీడ్ గా షూటింగ్ ను చుట్టేస్తున్నారో.. అంతే స్పీడ్ తో ప్రమోషనల్ కంటెంట్ ను వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చూస్తుండగానే..

Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌కు చేరిన సర్కారు షూటింగ్.. నెక్స్ట్ రచ్చ మహేష్‌దే!

Sarkaru Vaari Paata

Updated On : March 11, 2022 / 8:59 PM IST

Sarkaru Vaari Paata: ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది సర్కారు వారి పాట. ఎంత స్పీడ్ గా షూటింగ్ ను చుట్టేస్తున్నారో.. అంతే స్పీడ్ తో ప్రమోషనల్ కంటెంట్ ను వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చూస్తుండగానే రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. అందుకే షూటింగ్, ప్రమోషన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటూ ఇప్పుడు రచ్చంతా సూపర్ స్టార్ మూవీదే కనిపిస్తోంది.

Sarkaru Vaari Paata: అటు షూటింగ్.. ఇటు ప్రమోషన్.. ఫ్యాన్స్‌కి మహేశ్ సూపర్ ట్రీట్

వడివడిగా సర్కారు వారి పాటను పూర్తి చేస్తున్నారు మహేశ్ బాబు. రిలీజ్ కి పెద్ద గ్యాప్ లేదు కాబట్టి తన పార్ట్ షూట్ ను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ను మహేశ్, సముద్రఖని బ్యాచ్ పై షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ పరశురామ్. మార్చ్ 14 నుంచి మిగిలిన రెండు పాటల షూటింగ్ ను పూర్తిచేసేలా ప్లాన్ రెడీ చేశారు. ప్యాచ్ వర్క్ తో సహా కానిచ్చేసి మార్చ్ 27 నాటికి సర్కారు వారి పాటకు మూవీ యూనిట్ గుమ్మడికాయ కొట్టబోతుంది.

Sarkaru Vaari Paata: ఇక ఆగడు.. ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మహేశ్!

ట్రెండింగ్ లో సత్తా చాటుతున్న కళావతి సాంగ్ తర్వాత సర్కారు వారి పాట నుంచి మరో మాసివ్ ట్రీట్ రెడీ చేశారు. ఈ సినిమా నుంచి త్వరలోనే పక్కా మాస్ ట్యూన్ ని వదలబోతున్నారు. ఇప్పటికే మహేశ్ మార్క్ స్టైలిష్ లుక్స్ తో కళావతి సాంగ్ హవా కొనసాగిస్తుంటే.. కొత్తగా వచ్చే సాంగ్ దానిని మించేలా ఉండబోతుందని థమన్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఏప్రిల్ సెంటిమెంట్.. హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడా?

మార్చ్ 27న షూటింగ్ అయిపోతే పరశురామ్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటూ ప్రమోషనల్ మెటిరీయల్ పై కాన్సట్రేట్ చేయాలి. ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ సినిమా రిలీజ్ కోసం ట్రై చేస్తున్నారు. సర్కారు వారి పాట తమిళ్ వర్షన్ కోసం ఆల్రెడీ పనులు స్టార్టయ్యాయి. హిందీతో పాటూ మిగిలిన డబ్బింగ్ వర్షన్స్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. మే 12 సినిమా రిలీజ్ వరకు మొత్తంగా ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసి రికార్డ్ కొట్టేయడానికి సర్కారు టీమ్ గట్టిగానే ట్రై చేస్తోంది.