Sarvam Maya: పది రోజుల్లోనే వంద కోట్లు.. ‘సర్వం మాయ’ కోసం ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముంది ఈ సినిమాలో?

మలయాళ ఇండస్ట్రీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సర్వం మాయ(Sarvam Maya) సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల కలక్షన్స్ రాబట్టింది.

Sarvam Maya: పది రోజుల్లోనే వంద కోట్లు.. ‘సర్వం మాయ’ కోసం ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముంది ఈ సినిమాలో?

Sarvam Maya movie collected 100 crores in just ten days.

Updated On : January 4, 2026 / 11:59 AM IST
  • సర్వం మాయ సినిమాకు భారీ రెస్పాన్స్
  • సినిమా చూసేందుకు ఎగబడుతున్న ఆడియన్స్
  • పదిరోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్

Sarvam Maya: మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్వం మాయ’. కామెడీ అండ్ హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించాడు. రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మోహాన్ లాల్ వృషభ లాంటి పాన్ ఇండియా మూవీతో కాంపిటీషన్ గా విడుదలైన ఈ సినిమా ఏకంగా భారీ విజయాన్ని సాధించింది. ఐదు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సర్వం మాయ(Sarvam Maya) సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. రోజురోజుకి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆధరణ పెరుగుతోంది.

Rajsaab vs Jana Nayakudu: ఇదేం అన్యాయం.. రాజాసాబ్ ని పక్కన పెట్టి విజయ్ సినిమాకు థియేటర్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్

రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతంగా పెరిగే అవకాశం ఉండంతో ట్రేడ్ వర్గాలు చేపిస్తున్నాయి. అయితే, ఈ కలెక్షన్స్ కూడా కేవలం మలయాళంలో మాత్రమే రావడం విశేషం. ఎందుకంటే, ఈ సినిమాను ఇంకా అన్ని భాషల్లో విడుదల చేయలేదు. ప్రస్తుతం, ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి మగత భాషల్లో కూడా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అంతకన్నా ముందు, సర్వం మాయ సినిమాలో అంతలా ఏముంది అనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో ఒక గిటార్ ప్లేయర్. కానీ, దానికి డిమాండ్ లేకపోవడంతో తన ఫ్రెడ్ తో కలిసి పూజారిగా మారుతాడు. ఆలా ఒకరోజు ఒక ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి వెళతాడు.

అక్కడ ఆ హీరోకి మయా అనే దెయ్యం పరిచయం అవుతుంది. మరి ఆ తరువాత ఎం జరిగింది. ఆ మాయ ఎవరు? తన పాస్ట్ ఏంటి? అనేది తెలుసుకోవడమే సర్వం మాయ కథ. చెప్పుకోవడానికి చాలా సింపుల్ గానే ఉంది కథ. కానీ, దానిని ప్రెజెంట్ చేసిన విధానం చాలా ఫ్రెష్ గా ఉంది. ఓపక్క కామెడీ, ఓపక్క హారర్, మరోపక్క కావాల్సినంత ఎమోషన్ కలిపి ఆడియన్స్ ను త్రిల్ చేశాడు దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది.