సీమరాజా-ట్రైలర్
సీమరాజా ట్రైలర్ రిలీజ్.

సీమరాజా ట్రైలర్ రిలీజ్.
తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్, సమంత జంటగా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సీమరాజా, అదేపేరుతో తెలుగులో రిలీజవబోతుంది. ఆర్.డి.రాజా నిర్మాణంలో, పొన్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన సీమరాజా, తమిళనాట బి.సి.సెంటర్స్‌లో బాగా ఆడింది. రెండు ఊళ్ళ మధ్య జరిగే సంఘటనలతో తెరకెక్కిన పక్కా కయర్షియల్ సినిమా ఇది. రెమో తర్వాత తెలుగులో రిలీజవుతున్న శివకార్తికేయన్ సినిమా సీమరాజానే. ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ సిమ్రన్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించింది. కీర్తి సురేష్ అతిథి పాత్రలో కనిపించనుంది.
రీసెంట్‌గా సీమరాజా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సాయికృష్ణ ఫిలింస్ వారు సీమరాజాని తెలుగులో డబ్ చేసారు. లాల్, నెపోలియన్, సూరి తదితరులు నటించిన సీమరాజా
ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతుంది. సంగీతం : డి.ఇమాన్, కెమెరా : బాలసుబ్రమణియన్, ఎడిటింగ్ : వివేక్ హర్షన్, స్టంట్స్ : అనల్ అరసు, కొరియోగ్రఫీ : దినేష్, శోభి, బాబా భాస్కర్.
వాచ్ ట్రైలర్…