Seetha Kalyana Vaibhogame : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అతిథిగా.. ‘సీతా కళ్యాణ వైభోగమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Seetha Kalyana Vaibhogame movie pre release event highlights
Seetha Kalyana Vaibhogame : విలేజ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ సినిమాని సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్ లో జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. “నేను ఎమ్మెల్యేగా గెలుపొందడంలో మా మిత్రుడు యుగంధర్ కూడా ఒక కారణం. అలాంటి నా మిత్రుడు నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీం మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Pawan Kalyan: పవన్ కల్యాణ్ నామినేషన్.. ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
ఇక హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. తమలంటూ కొత్తవారిని ఎంకరేజ్ చేస్తున్న నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేసారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ఆడపిల్ల పుడితే అదృష్టమని చాలామంది అంటుంటారు. కానీ ఆ ఆడపిల్లకు సరైన కేరాఫ్ అడ్రస్ లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. వారి ఎమోషనల్ జర్నీనే కమర్షియల్ ఫార్మేట్ లో బోర్ కొట్టకుండా సందేశాత్మకంగా చూపించినట్లు పేర్కొన్నారు.
డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ అయితే ఆడియన్స్ నుంచి మంచి స్పందనే అందుకుంది.