Kubera : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా స్టోరీ ఇదేనా? శేఖర్ కమ్ముల గత సినిమాలకు భిన్నంగా?

తాజాగా కుబేర సినిమా స్టోరీ గురించి టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Kubera : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా స్టోరీ ఇదేనా? శేఖర్ కమ్ముల గత సినిమాలకు భిన్నంగా?

Sekhar Kammula Nagarjuna Dhanush Kubera Movie Story goes Viral

Updated On : March 14, 2024 / 10:22 AM IST

Kubera Movie : శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్(Dhanush) హీరోగా ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున(Nagarjuna) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే శివరాత్రి రోజున కుబేర సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో ధనుష్ ఓ బిచ్చగాడిలా కనిపించాడు. దీంతో ఈ లుక్ వైరల్ గా మారింది. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా వరకు లవ్ స్టోరీలు, మంచి రామ్ కామ్ లు ఉంటాయి. కానీ మొదటిసారి తన జానర్ కి భిన్నంగా ఈ సినిమా తీయబోతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా కుబేర సినిమా స్టోరీ గురించి టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ధనుష్ మెయిన్ లీడ్ లో, నాగార్జున ముఖ్య పాత్రలో కుబేర తెరకెక్కుతుంది. నాగార్జున ఇందులో ఓ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు, ఈ కథ ముంబైలోని ఓ మాఫియా డాన్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. అయితే ఆ మాఫియా డాన్ ధనుషేనా? లేక ఆ డాన్ కి ధనుష్ కి సంబంధం ఏమైనా ఉండబోతుందా? ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించబోతున్నాడా అంటూ చర్చిస్తున్నారు. అయితే ఈ సినిమా బిచ్చగాడు సినిమా లాంటి కథ అని, యాక్షన్ పార్ట్ జోడిస్తున్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది.

Also Read : R Narayana Murthy : అల్లు అర్జున్ ‘పుష్ప’పై ఆర్. నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు.. తగ్గేదేలే..

శేఖర్ కమ్ముల మాత్రం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఈ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. మరి నాగార్జున – ధనుష్ కాంబో తెరపై ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా షూట్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతుందని, నాగార్జున మీద సీన్స్ చిత్రీకరిస్తున్నామని చిత్రయూనిట్ తాజాగా ప్రకటించారు.