Annapurna : సీనియర్ నటి అన్నపూర్ణ జీవితంలో ఇంత విషాదమా..? కూతురు ఆత్మహత్య..

సుమ అడ్డా షోలో నటి అన్నపూర్ణ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకొని ఏడ్చేసింది.

Annapurna : సీనియర్ నటి అన్నపూర్ణ జీవితంలో ఇంత విషాదమా..? కూతురు ఆత్మహత్య..

Senior Actress Annapurna got Emotional on Anchor Suma show

Updated On : November 15, 2023 / 7:53 AM IST

Senior Actress Annapurna : సీనియర్ నటి అన్నపూర్ణ దాదాపు 50 ఏళ్లుగా సినిమాల్లో ఉంది. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన అన్నపూర్ణ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మ, అత్త, బామ్మ పాత్రలతో ఈ జనరేషన్ ని కూడా మెప్పిస్తుంది. ఇప్పుడు, గతంలో ఉన్న స్టార్ హీరోలందరితో అన్నపూర్ణమ్మ నటించి మెప్పించింది. కొన్ని వందల సినిమాల్లో నటించింది.

75 ఏళ్ళ వయసులో కూడా ఇంకా యాక్టివ్ గా సినిమాలు చేస్తూ, షోలలో కనిపిస్తూ ఫుల్ బిజీగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది అన్నపూర్ణమ్మ. తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ యాంకర్ సుమ(Anchor Suma) షో సుమ అడ్డాకి వచ్చారు. అన్నపూర్ణమ్మతో పాటు సీనియర్ నటీమణులు వై విజయ, శ్రీలక్ష్మి, జయలక్ష్మిలు కూడా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో ఎంటర్టైన్మెంట్ తో పాటలు ఎమోషన్ కూడా చూపించారు. సుమ అడ్డా షోలో నటి అన్నపూర్ణ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకొని ఏడ్చేసింది. నటి అన్నపూర్ణకు పిల్లలు లేకపోతే కొన్నేళ్ల క్రితమే కీర్తి అనే ఓ పాపని దత్తత తీసుకొని కూతురిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించింది. అయితే అన్నపూర్ణ కూతురు కీర్తికి ఇంకో పాప పుట్టింది. ఆ పాపకి పుట్టుకతోనే మాటలు రాలేదు. ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సమస్య తీరలేదు. ఈ విషయంలో కీర్తి బాగా బెంగ పెట్టుకొని మానసికంగా బాధపడింది. ఆ బాధతో ఐదేళ్ల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది.

Annapurna

కూతురి ఆత్మహత్య గురించి నటి అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఆ రోజు బజ్జిలు చేసి ఇచ్చాను, రెండు తిని చాలు మమ్మి అంది. వాళ్ళ అత్తగారు ఊరు వెళ్తున్నారు అంటే మా ఇంట్లోనే పడుకోమన్నాను. కానీ వాళ్ళ ఆయన ఉన్నాడు కదా అని వెళ్ళిపోయింది. తెల్లవారుజామున చనిపోయింది. అసలు ఉరి వేసుకుంటుందని ఆలోచన కూడా రాలేదు అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. దీంతో అందర్నీ తన సినిమాలతో నవ్వించి మెప్పించే అన్నపూర్ణమ్మ జీవితంలో ఇంత విషాదం ఉందా అని అనుకుంటున్నారు.