Shyam Benegal : స్టార్ డైరెక్టర్ కన్నుమూత.. ఏకంగా 18 నేషనల్ అవార్డులు గెలుచుకున్న హైదరాబాద్ వ్యక్తి..

తాజాగా నేడు సాయంత్రం ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మరణించారు.

Shyam Benegal : స్టార్ డైరెక్టర్ కన్నుమూత.. ఏకంగా 18 నేషనల్ అవార్డులు గెలుచుకున్న హైదరాబాద్ వ్యక్తి..

Senior Director Hyderabad Born Person Shyam Benegal Passes Away at The Age of 90

Updated On : December 23, 2024 / 8:22 PM IST

Shyam Benegal : తాజాగా నేడు సాయంత్రం ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 90 ఏళ్ళ వయసులో నేడు సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కూతురు పియా బెనెగల్ అధికారికంగా తెలిపారు.

Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి రెండో సాంగ్ వచ్చేసింది.. మంచి ఎమోషనల్ సాంగ్..

శ్యామ్ బెనెగల్ ఇక్కడ మన హైదరాబాద్ లోనే జన్మించాడు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆయనకు బంధువులు ఉండటంతో సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో ముంబై వెళ్లిపోయారు. రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టారు శ్యామ్ బెనెగల్. ఆయన కెరీర్ లో అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక, సర్దారు బేగం, జుబేదా, మండి, త్రికాల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్.. లాంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో తీశారు.

సినిమాలే కాకుండా చాలా డాక్యుమెంటరీ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, టెలివిజన్ షోలు కూడా డైరెక్ట్ చేశారు శ్యామ్ బెనెగల్. ఈయన చేసిన అన్ని సినిమాలకు ఆల్మోస్ట్ ఏదో ఒక అవార్డులు వచ్చాయి. ఏకంగా ఈయనకు 18 సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు ఇచ్చి సత్కరించింది.

Also Read : Teenmar Mallanna : పుష్ప 2 సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న.. అలాంటి సీన్ ఉంటే సెన్సార్ ఎలా ఇచ్చారు?

ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి శ్యామ్ బెనెగల్ పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇలాంటి లెజెండరీ డైరెక్టర్ నేడు ముంబై లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.