Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి రెండో సాంగ్ వచ్చేసింది.. మంచి ఎమోషనల్ సాంగ్..
తాజాగా డాకు మహారాజ్ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు.

Balakrishna Daaku Maharaaj Movie Second Song Released
Daaku Maharaaj Song : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాతో సంక్రాంతికి జనవరి 12న రాబోతున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు.
Also Read : Venkatesh – Balakrishna : డ్యాన్సులతో కుమ్మేసిన బాలయ్య బాబు, వెంకీమామ.. అన్‌స్టాపబుల్ షూటింగ్ ఫోటోలు చూశారా?
‘చిన్ని.. చిన్ని..’ అంటూ సాగే ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో విశాల్ మిశ్రా పాడారు. ఈ పాట చూస్తుంటే ఓ చిన్న పాప ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ సాంగ్ లా ఉంది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
డాకు మహారాజ్ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.
ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నేడు ప్రెస్ మీట్ నిర్వహించగా జనవరి 2న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో, జనవరి 4న అమెరికాలో సాంగ్ లాంచ్ ఈవెంట్, జనవరి 8న ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.